ICICI Chanda Kochhar: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వీడియోకాన్ గ్రూపునకు రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలు, అవినీతికి పాల్పడినట్లు నమోదైన కేసులో విచారణ జరిపిన సీబీఐ.. వీరిద్దరినీ అదుపులోకి తీసుకుంది. 2018లో వీడియోకాన్ గ్రూపునకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా చందా కొచ్చర్ వైదొలిగారు.
ఈ నేపథ్యంలో 2012లో బ్యాంకు సీఈవో హోదాలో రూ.3,250 కోట్ల రుణం మంజూరు చేయడం ద్వారా ఆమె కుటుంబం లబ్ధి పొందినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ చందా కొచ్చర్‌తోపాటు ఆమె భర్తను అరెస్టు చేసింది.
ICICI బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ అరెస్ట్.. ఆ కేసులోనే.. - మనీలాండరింగ్ కేసులో చందా కొచ్చర్ అరెస్ట్
ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్తను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీడియోకాన్ గ్రూపునకు సంబంధించిన కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నారు.