ETV Bharat / business

మీ కారుపై గీతలు పడ్డాయా - ఇలా ఈజీగా తొలగించండి! - కారుపై స్క్రాచెస్ తొలగించే బెస్ట్ టిప్స్

How to Remove Car Scratches at Home : ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన కొత్త కారును.. ఇంకెంత మురిపెంగా చూసుకుంటారో అందరికీ తెలిసిందే. అలాంటి కారుపై గీతలు పడితే..? ఎంతో బాధపడిపోతారు. అయితే.. ఈ స్క్రాచెస్​ను ఇంటి వద్దనే ఎలా తొలగించుకోవాలో.. మీకు తెలుసా?

Car Care Tips
How to Remove Car Scratches at Home
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2023, 10:20 AM IST

How to Remove Car Scratches at Home : సాధారణంగా ఎవరైనా కొత్త వాహనం కొన్న తర్వాత.. దాని మెయిన్ టెనెన్స్​పై చాలా శ్రద్ధ చూపుతారు. పొద్దున్నే లేచి తుడుస్తూ.. సమయానికి వాష్ చేయిస్తూ.. అపురూపంగా చూసుకుంటారు. ఇక, కార్ల ​ విషయంలో ఈ జాగ్రత్తలు కాస్త ఎక్కువ తీసుకుంటారు. అయితే.. ఊహించని విధంగా గోడలకు గీసుకోవడమో, వేరే వాహనాలకు రాసుకుపోవడమో జరిగితే.. స్క్రాచెస్ పడతాయి. ఇవి చూడగానే గుండె బద్ధలైనంత పనైపోతుంది చాలా మందికి. గీతలు పడిన బాధ ఒకటైతే.. మళ్లీ షోరూమ్​కు తీసుకెళ్లి డబ్బులు ఖర్చు చేయడం మరో బాధ. కానీ.. మేము చెప్పే ఈ టిప్స్ పాటిస్తే.. మెకానిక్ దగ్గరగా వెళ్లాల్సిన అవసరం లేకుండానే.. స్క్రాచెస్ మాయం చేయొచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్లియర్ కోట్ స్క్రాచెస్
క్లియర్ కోట్ స్క్రాచెస్

Clear Coat Scratches : కార్లపై మనకు ఎక్కువగా కనపడేవి "క్లియర్ కోట్ స్క్రాచెస్". అంటే.. కారు పెయింట్​ పైపొరను మాత్రమే దెబ్బ తింటే.. వాటిని క్లియర్ కోట్ స్క్రాచెస్ అంటారు. సాధారణంగా చెట్ల కొమ్మలు తగలడం.. పిల్లలు ఏదైనా వస్తువుతో గీకడం వంటి.. చిన్న చిన్న ఎఫెక్టుల కారణంగా ఈ గీతలు పడతాయి. అయితే.. వీటిని తొలగించడానికి కొంతమంది ఏవేవో పనులు చేస్తారు. కానీ.. ఒక్కోసారి ఫలితం ఉండకపోగా.. మరింత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది.

వీటిని ఈజీగా తొలగించుకోవాలంటే.. ముందుగా సబ్బు నీటితో ఆ గీతలు పడిన ప్రాంతాన్ని క్లీన్ చేయాలి. ఆ తర్వాత ఒక మైక్రోఫైబర్ వస్త్రాన్ని తీసుకొని దానికి కొద్దిగా రబ్బింగ్ కాంపౌండ్ లేదా పాలిష్ యాడ్​ చేసుకుని స్క్రాచ్​ ఉన్న ప్రాంతంలో గుండ్రంగా రుద్దాలి. స్క్రాచ్ మాయమయ్యేంత వరకూ రుద్దాలి. దీనికి కొంతసమయం పట్టవచ్చు. చివరగా ఇంకేమైనా మరకలు ఉంటే.. ఒక శుభ్రమైన పొడి క్లాత్ తీసుకొని మరోసారి క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే.. క్లియర్ కోట్ స్క్రాచెస్ ఇట్టే మాయమవుతాయి.

డ్రైవింగ్​​ చేస్తున్నప్పుడు బ్రేకులు ఫెయిల్ అయ్యాయా?-ఈ టిప్స్ తెలిసి ఉంటే ఈజీగా ప్రమాదం నుంచి బయటపడొచ్చు!

Surface Scratches : కాస్త ఎక్కువ ఎఫెక్ట్ చేస్తే.. వాటిని సర్ఫేస్ స్క్రాచెస్ అంటారు. కారు పెయింట్​ పొరలన్నీ దెబ్బతీస్తాయి. సాధారణంగా.. రాళ్లకు, మరో వాహనానికి రాసుకుపోయినప్పుడు ఈ స్క్రాచెస్ ఏర్పడతాయి. ఇవి క్లియర్ కోట్ స్క్రాచ్‌ల కన్నా బలమైనవి. ఈ స్క్రాచెస్​ను తొలగించడానికి.. ముందుగా ఈ ప్రాంతాన్ని సబ్బు నీటితో క్లీన్​ చేసుకోవాలి. ఆ తర్వాత మెత్తని గుడ్డ లేదా స్పాంజ్‌ తీసుకొని దానికి కొద్ది మొత్తంలో టూత్‌పేస్ట్ లేదా బేకింగ్ సోడాను కలిపిన నీటిని అప్లై చేసుకుని స్క్రాచ్ దగ్గర గుండ్రంగా అటూ ఇటూ సున్నితంగా రుద్దండి. అలా చేసినా పూర్తిగా క్లియర్ కాకపోతే.. మరోసారి రిపీట్ చేయాలి. తద్వారా సర్ఫేస్ స్క్రాచెస్ తొలగించుకోవచ్చు.

డీప్ స్క్రాచెస్
డీప్ స్క్రాచెస్

Deep Scratches : కారు కాస్త గట్టిగానే ఢీకొనడం ద్వారా ఈ స్క్రాచెస్ ఏర్పడతాయి. వీటిని తొలగించుకోవడానికి చాలా మంది వర్క్​షాప్​లను ఆశ్రయిస్తుంటారు. అది ఖర్చుతో కూడుకున్నది. కానీ.. ఇలా చేయడం ద్వారా వీటిని కూడా తొలగించుకోవచ్చు. డీప్ స్క్రాచెస్ తొలగించే ముందు.. సబ్బు నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత సాండ్ పేపర్ తీసుకొని 10 నుంచి 15 నిమిషాలు నీటిలో నానబెట్టాలి. తర్వాత దాంతో స్క్రాచెస్​ ఉన్న చోట.. నిదానంగా రుద్దండి. ఇలా స్క్రాచ్​ లెవలింగ్ చేసిన తర్వాత.. చిన్న బ్రష్​తో మీ కారు రంగుకు సరిపోయే టచ్​ అప్ పెయింట్​ను అక్కడ అప్లై చేయండి. అంతే అక్కడ డీప్ స్క్రాచ్ తొలగిపోతుంది.

డ్రైవింగ్‌ చేయాలంటే భయపడుతున్నారా? ఈ టిప్స్​తో దూసుకెళ్లండి!

కారు మైలేజ్ తగ్గిపోతోందా? ఈ టిప్స్ పాటిస్తే సూపర్‌ మైలేజ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.