ETV Bharat / business

మీ క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాలా? పాన్​ కార్డ్​తో సింపుల్​గా చెక్​ చేసుకోండిలా! - ఉచితంగా క్రెడిట్ స్కోర్ తెలుసుకోవడం ఎలా

How To Check Credit Score Using PAN Card In Telugu : మీ క్రెడిట్ స్కోర్​ను చెక్ చేసుకోవాలని అనుకుంటున్నారా? కానీ ఎలా చెక్ చేసుకోవాలో తెలియడం లేదా? అయితే ఇది మీ కోసమే. మీ పాన్​ కార్డ్ ఉపయోగించి, ఆన్​లైన్​లో చాలా సింపుల్​గా మీ క్రెడిట్ స్కోర్​ను చెక్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.

How to check CIBIL score using PAN card
How to check credit score using PAN card
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2023, 11:16 AM IST

How To Check Credit Score Using PAN Card : క్రెడిట్ స్కోర్ అనేది మన ఆర్థిక స్థితిగతులను, రుణాలు తీర్చగలిగే సామర్థ్యాన్ని తెలిపే ఒక కొలమానం. ఈ క్రెడిట్ స్కోర్ ఆధారంగానే మనకు రుణాలు ఇవ్వాలా? వద్దా? అనేది బ్యాంకులు నిర్ణయిస్తాయి. అంతేకాదు వడ్డీ రేట్లను కూడా ఈ క్రెడిట్ స్కోరే ప్రభావితం చేస్తుంది. అందుకే మన క్రెడిట్​ స్కోర్​ను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవడం మంచిది. దీని ద్వారా మన క్రెడిట్​ స్కోర్​ పడిపోకుండా జాగ్రత్త పడవచ్చు.

పాన్ కార్డ్ ద్వారా..
మన క్రెడిట్​ స్కోర్​ను చాలా సింపుల్​గా పాన్ కార్డ్ ఉపయోగించి తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

స్టెప్​ 1 : ముందుగా మీ పాన్​ కార్డ్​ను సిద్ధంగా ఉంచుకోండి. ఎందుకంటే, ఈ కార్డులో ఉన్న మీ పేరు, పుట్టిన తేదీ, పాన్​కార్డ్ నంబర్​లను.. క్రెడిట్​ స్కోర్​ తెలిపే వెబ్​సైట్లలో నమోదు చేయాల్సి ఉంటుంది.

స్టెప్​ 2 : భారతదేశంలో సిబిల్, ఎక్స్​పీరియన్, ఈక్వీఫాక్స్​ లాంటి ఎన్నో క్రెడిట్ బ్యూరో సంస్థలు ఉన్నాయి. ఇవి క్రెడిట్ రిపోర్టులను అందిస్తూ ఉంటాయి. మీరు వీటిలో ఏ ఒక్కదాన్నైనా ఎంచుకోవచ్చు. కానీ మల్టిపుల్​ వెబ్​సైట్స్​లో క్రెడిట్ స్కోర్ చెక్​ చేసుకోవడం వల్ల.. మన క్రెడిట్ హిస్టరీపై మరింత క్లారిటీ వస్తుంది.

స్టెప్​ 3 : మీరు మీకు నచ్చిన క్రెడిట్ బ్యూరో వైబ్​సైట్​ ఓపెన్ చేయాలి. ఇక్కడ కచ్చితంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఆఫీషియల్ వెబ్​సైట్స్​ను మాత్రమే మీరు ఉపయోగించాలి. లేదంటే.. మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

స్టెప్​ 4 : క్రెడిట్ బ్యూరో వైబ్​సైట్లలో Check Your Credit Score అనే ఆప్షన్​ కనిపిస్తుంది. ఆ ఆప్షన్​పై క్లిక్ చేసి ఓపెన్ చేయాలి.

స్టెప్​ 5 : అక్కడ మీకు ఓ దరఖాస్తు ఫారం కనిపిస్తుంది. అందులో మీ పేరు, పుట్టిన తేదీ, పాన్​ కార్డ్ నంబర్​ లాంటి వ్యక్తిగత వివరాలు నమోదు చేసి సబ్మిట్​ చేయాలి. అయితే మీరు ఇచ్చే వివరాల్లో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి.

స్టెప్ 6 : సాధారణంగా క్రెడిట్ బ్యూరో వెబ్​సైట్లు.. ఐడెంటిటీ వెరిఫికేషన్​ చేస్తాయి. ఇందులో భాగంగా మిమ్మల్ని కొన్ని సెక్యూరిటీ ప్రశ్నలు కూడా వేస్తాయి. ముఖ్యంగా మీ ఫైనాన్సియల్ హిస్టరీ గురించి అడుగుతుంటాయి. కొన్నిసార్లు అదనపు డాక్యుమెంట్లు కూడా అప్​లోడ్ చేయమని సూచిస్తుంటాయి. ఇదంతా యూజర్ల భద్రత కోసమే. మీరు వీటన్నింటినీ సమర్పించిన తరువాత.. క్రెడిట్ బ్యూరో వెబ్​సైట్లు.. మీ క్రెడిట్​ స్కోర్​ను ఒక ఫైల్ రూపంలో అందిస్తాయి. ఇంతే సింపుల్​!

స్టెప్​ 7 : క్రెడిట్​ స్కోర్​ను మీరు పూర్తిగా చదవాలి. ముఖ్యంగా మీ క్రెడిట్ అకౌంట్స్​, రీపేమెంట్ హిస్టరీ, తీర్చాల్సిన అప్పుల వివరాలు అన్నింటినీ చెక్ చేయాలి. ఎక్కడైనా పొరపాట్లు జరిగినట్లు గుర్తిస్తే.. వెంటనే మీ బ్యాంకును సంప్రదించాలి. అలాగే క్రెడిట్ బ్యూరో సంస్థలకు ఫిర్యాదు చేసి, సరిచేయించుకోవాలి.

పిల్లల బంగారు భవిష్యత్ కోసం బెస్ట్ ఇన్వెస్ట్​మెంట్ ప్లాన్​ ఇదే!

అధిక వడ్డీ ఇచ్చే స్పెషల్ FD​ స్కీమ్స్​ ఇవే! కొద్ది రోజులే ఛాన్స్​!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.