ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. నేటి లెక్కలు ఇలా! - gold rate today

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి. మరోవైపు, దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Gold Rate Today
Gold Rate Today
author img

By

Published : Oct 11, 2022, 11:57 AM IST

Updated : Oct 11, 2022, 12:45 PM IST

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.760 తగ్గి ప్రస్తుతం రూ.52,240గా ఉంది. కేజీ వెండి ధర రూ.1,200 తగ్గి.. రూ.59,300 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,240గా ఉంది. కిలో వెండి ధర రూ.59,300 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,240 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.59,300గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,240గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,300 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,240 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.59,300 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,664 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 19.40 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు.. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.15,68,607 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.15,68,607
ఇథీరియంరూ.1,05,185
టెథర్​రూ.82.37
బినాన్స్​ కాయిన్​రూ.22,234
యూఎస్​డీ కాయిన్రూ.82.38

నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 265 పాయింట్లకు పైగా నష్టపోయి ప్రస్తుతం 57,725 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 95 పాయింట్లకు దిగజారి 17,150 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్ టాప్‌ 30 సూచీల్లో ఏషియన్ పెయింట్​, యాక్సిక్ బ్యాంక్​, బజాజ్ ఫైనాన్స్​, బజాన్ ఫిన్​జర్వ్, పవర్ గ్రిడ్, ఐటీసీ షేర్లు లాబాల్లో కొనసాగుతుండగా.. మిగతా షేర్లన్ని నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి: అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ మంగళవారం స్వల్పంగా తగ్గింది. ట్రేడింగ్ ప్రారంభంలో 1 పైసా నష్టపోయి.. ప్రస్తుతం 82.41కు చేరింది.

ఇవీ చదవండి: దసరాకు జోరుగా అమ్మకాలు.. 5.4 లక్షల వాహనాలు విక్రయం!

క్యూ2లో టీసీఎస్ అదుర్స్.. భారీగా పెరిగిన ఆదాయం.. లాభం 8శాతం జంప్

Last Updated : Oct 11, 2022, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.