Gold Rate Today : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర బుధవారం తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.300కు పైగా తగ్గి ప్రస్తుతం రూ.52,550 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.600కు పైగా తగ్గింది. ప్రస్తుతం రూ.55,205 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,550గా ఉంది. కిలో వెండి ధర రూ.55,205 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,550 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.55,205గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,550గా ఉంది. కేజీ వెండి ధర రూ.55,205 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,550 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.55,205 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1725 డాలర్లకు తగ్గింది. ఔన్సు వెండి ధర 18.51 డాలర్ల వద్ద ఉంది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 79.52 వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు.. బిట్‌కాయిన్ విలువ రూ.13,485 మేర తగ్గింది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.16,16,652 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.16,16,652 |
ఇథీరియం | రూ.1,27,281 |
టెథర్ | రూ.79.51 |
బినాన్స్ కాయిన్ | రూ.22,985 |
యూఎస్డీ కాయిన్ | రూ.79.53 |
స్టాక్ మార్కెట్లు.. గణేశ్ చతుర్థి సందర్భంగా ఆగస్టు 31న స్టాక్ మార్కెట్లకు సెలవు.
ఇవీ చదవండి: ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి అదానీ, అంబానీ ర్యాంకు ఎంతంటే