Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. పది గ్రాముల బంగారం రూ.430 మేర తగ్గి ప్రస్తుతం రూ.55,720 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.1,100 పతనమైంది. ప్రస్తుతం కేజీ వెండి రూ.68,800 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.55,720గా ఉంది. కిలో వెండి ధర రూ.68,800 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.55,720 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,800గా ఉంది.
- Gold price in Vizag: వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.55,720గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,800వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.55,720 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.68,800గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,792 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.20 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.14,63,418 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.14,63,418 |
ఇథీరియం | రూ.1,06,62 |
టెథర్ | రూ.82.60 |
బైనాన్స్ కాయిన్ | రూ.21,866 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.62 |
స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 241 పాయింట్ల నష్టంతో 62,436 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 70 పాయింట్లు కోల్పోయి 18,590 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.63 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 సూచీలో సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఎంఅండ్‌ఎం, ఎన్‌టీపీసీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఎల్అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభాల్లో ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్, టీసీఎస్, టైటన్, టాటా స్టీల్, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, రిలయన్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అమెరికాలో వడ్డీరేట్లను మరో 0.5 పెంచుతున్నట్లు ఫెడరల్ రిజర్వు ప్రకటించింది. వరుసగా అయిదో నెలా ద్రవ్యోల్బణం తగ్గి 7.1 శాతానికి పరిమితం కావడంతో కీలక రేట్ల పెంపులో వేగాన్ని తగ్గించింది. తాజా నిర్ణయంతో ఫెడ్ వడ్డీ రేటు 4.25-4.50 శాతం శ్రేణికి చేరింది. 2023 చివరి నాటికి మరో 0.75% వడ్డీ పెంపు ఉండొచ్చని ఫెడ్ పేర్కొనడం అక్కడి మార్కెట్లకు ప్రతికూలంగా మారింది. దీంతో అక్కడి మూడు ప్రధాన సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా పసిఫిక్ సూచీలు నేడు నష్టాల్లో కొనసాగుతున్నాయి.