ETV Bharat / business

Fixed Deposits : అధిక రాబడి రావాలా?.. అయితే ఇలా చేయండి!

Fixed Deposits : ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు.. అధిక రాబడి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారా? ఫిక్స్​డ్​ డిపాజిట్ల ద్వారా ఆదాయ పొందాలనుకుంటున్నారా? అయితే ఇలాంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాం.

fixed-deposit-advice-fixed-deposit-interest-rates-in-banks
ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు అధిక వడ్డీ మార్గాలు
author img

By

Published : Apr 28, 2023, 8:35 PM IST

Fixed Deposits : అధిక రాబడి రావాలనుకునే వారు.. నష్టభయాన్ని సైతం భరించేందుకు సిద్ధంగా ఉండాలి. హామీతో కూడిన రాబడిని పొందే పథకాలను ఎంచుకోవాలంటే.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ముందుంటాయి. దేశంలో ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా.. సంవత్సర కాలంగా కీలక వడ్డీ రేటును పెంచడం ప్రారంభించింది. మరోవైపు తక్కువ వడ్డీ రేట్లు కొనసాగుతున్నప్పుడు చాలామంది ఫిక్స్​డ్​ డిపాజిట్లకు ప్రత్యామ్నాయాలను వెదికారు. తద్వారా బ్యాంకులను నగదు కొరత వేధించింది. కాబట్టి బ్యాంకులు డిపాజిటర్ల నుంచి డబ్బును సేకరించి మంచి ప్రతిఫలం చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత కొంత కాలంగా ఫిక్స్​డ్​ డిపాజిట్ల వడ్డీ రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. నిర్ణీత వ్యవధులకు తొమ్మిది శాతానికి పైగానే వడ్డీ అందుతోంది. ఈ నేపథ్యంలో ఈ డిపాజిట్లను ఎంచుకునే సమయంలో ఏం చేయాలో చూద్దాం.

వడ్డీ రేట్లు పెరుగుతుండటం వల్ల ప్రస్తుతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు మెరుగ్గానే కనిపిస్తున్నాయి. ఏడాది క్రితం ఎస్​బీఐ గరిష్ఠంగా 5.5 శాతం వడ్డీని అందించింది. ఇప్పుడు ఇది 7.10 శాతానికి చేరుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ 7.1 శాతం, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 7.2 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. సీనియర్‌ సిటిజన్లు 0.50 శాతం అధికంగానే వడ్డీని పొందవచ్చు. యెస్‌ బ్యాంకు సైతం సీనియర్లకు 8.51 శాతం దాకా వడ్డీ ఇస్తున్నట్లు ప్రకటించింది.

9 శాతం వరకు..
కొత్త తరం స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు (ఎస్‌ఎఫ్‌బీ).. పెద్ద బ్యాంకులపై పోటీతో దూకుడుగా వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. సూర్యోదయ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌.. సీనియర్‌ సిటిజన్లకు 999 రోజుల వ్యవధికి 9.05 శాతం (యాన్యువలైజ్డ్‌ ఈల్డ్‌) వడ్డీని అందిస్తోంది. ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ 559 రోజుల డిపాజిట్‌లపై 8.20 శాతం, 560 రోజుల డిపాజిట్‌లపై 8.45 శాతం చెల్లిస్తోంది. యూనిటీ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ 1001 రోజుల వ్యవధికి సీనియర్‌ సిటిజన్లకు 9.5 శాతం వడ్డీని అందిస్తోంది. నెలవారీగా వడ్డీని చెల్లిస్తామని అంటోంది. 181 నుంచి 201రోజులు, 501 రోజుల వ్యవధికి 9.25 శాతం చొప్పున అందిస్తోంది. ఈక్విటాస్‌ ఎస్‌ఎఫ్‌బీ 888 రోజులకు 8.50 శాతం వడ్డీని చెల్లిస్తోంది. ఇవే కాకుండా ఇతర స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులూ.. వివిధ వ్యవధులకు ఎనిమిది శాతానికి పైగానే వడ్డీని అందిస్తున్నాయి. ఫిన్‌కేర్‌ ఎస్‌ఎఫ్‌బీ 750 రోజుల వ్యవధికి సీనియర్‌ సిటిజన్లకు 8.71 శాతం వడ్డీని ఇస్తోంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే రూ.5లక్షల లోపు డిపాజిట్లకు స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల్లోనూ డీఐసీజీసీ ద్వారా బీమా రక్షణ ఉంటుంది.

వ్యవధులు జాగ్రత్తగా..
ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లు ఎంచుకున్న వ్యవధిపై ఆధారపడి ఉంటాయన్న సంగతి మనందరికి తెలిసిందే. ప్రస్తుతం బ్యాంకులు అన్ని వ్యవధుల డిపాజిట్లపైనా ఎక్కువ వడ్డీని ఇవ్వటం లేదు. కాబట్టి, వ్యవధిని ఎంపిక చేసుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. చాలా బ్యాంకులు ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల వ్యవధి ఉండే డిపాజిట్లపైనే గరిష్ఠ వడ్డీని చెల్లిస్తున్నాయి. కాబట్టి, అవసరాన్ని బట్టి ఎంత వ్యవధికి డిపాజిట్‌ చేయాలన్నది నిర్ణయించుకోవడం మంచింది. ఒక బ్యాంకు ఏడాది వ్యవధికి గరిష్ఠ వడ్డీని అందిస్తుంటే.. అందులోనే ఎఫ్‌డీ చేయొచ్చు. కానీ ఇందులో ఆటో రెన్యువల్‌ సౌకర్యాన్ని ఎంచుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ఏడాది తర్వాత వడ్డీ రేట్లను సమీక్షించి, అదే బ్యాంకులో కొనసాగొచ్చని.. లేదంటే మార్చుకోవచ్చని సూచిస్తున్నారు. రెండేళ్ల వరకూ డబ్బు అవసరం లేదనుకుంటే.. దాదాపు 8 శాతానికి పైగా వడ్డీలను ఇస్తున్న బ్యాంకులను ఎంచుకోవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు.

విడివిడిగా..
పెద్ద మొత్తంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలనుకున్నప్పుడు మరో మార్గాన్ని అనుసరించేందుకు ప్రయత్నించవచ్చు. ఎక్కువ వడ్డీ ఇస్తున్న ఒక బ్యాంకులో సంవత్సరం డిపాజిట్‌, మరో బ్యాంకులో రెండేళ్లు, ఇంకో బ్యాంకులో మూడేళ్ల వ్యవధికి డిపాజిట్‌లను చేసే అంశాన్ని పరిశీలించవచ్చు. ఇలా ఒకే బ్యాంకులో డిపాజిట్లు చేయడం కాకుండా.. వేరువేరు వ్యవధులకు వేర్వేరు బ్యాంకులను ఎంచుకోవం మంచింది. దీనివల్ల రాబడి ఎక్కువగా వస్తుంది. ఇందులోనూ ప్రభుత్వ, ప్రైవేటు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు ఉండేలా చూసుకునే ప్రయత్నం చేయాలి. అయిదేళ్లకు మించి డిపాజిట్‌ చేయాలి అనుకున్నప్పుడు సాధ్యమైనంత వరకూ ప్రభుత్వ బ్యాంకులనే దృష్టిలో పెట్టుకోవాలి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.2 లక్షలను ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేయాలని అనుకుంటే.. రూ.యాభైవేల చొప్పున సంవత్సరం, రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్ల లేదా ప్రత్యేక వ్యవధి పథకాలను ఎంచుకొని, డిపాజిట్‌ చేయాలి. అదీ వివిధ బ్యాంకుల్లో డిపాడిట్​ చేయడం మంచిది.

ప్రత్యేక డిపాజిట్లూ..
కొన్ని బ్యాంకులు ప్రత్యేక డిపాజిట్లను అందించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే వీటి వ్యవధి ముగిసినప్పటికీ మరికొంత కాలం పొడిగించడం గమనార్హం. ఇందులో స్టేట్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా అమృత్‌ కలశ్‌ పేరుతో అందిస్తున్న 400 రోజుల ప్రత్యేక డిపాజిట్‌పై సీనియర్‌ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీ లభిస్తోంది. ఇది జూన్‌ 30వ తేది వరకు అందుబాటులో ఉంటుంది. ఐడీబీఐ బ్యాంక్‌ అమృత్‌ మహోత్సవ్‌ ఫిక్స్​ డిపాజిట్​ను 444 రోజుల వ్యవధికి సీనియర్‌ సిటిజన్లకు 7.65 శాతం వడ్డీని చెల్లిస్తోంది. ఇండియన్‌ బ్యాంక్‌ అందిస్తోన్న ఇండ్‌ సూపర్‌ 400 రోజులకు 7.25 శాతం వడ్డీని ఇస్తోంది. సీనియర్లకు మరో 0.50శాతం అదనం. ఇది జూన్‌ 30వ తేది వరకూ అందుబాటులో ఉంటుంది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ‘శుభ్‌ ఆరంభ్‌ డిపాజిట్‌’ పేరుతో అందిస్తున్న ప్రత్యేక పథకంలో 501 రోజుల వ్యవధికి సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు 7.80 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 7.65శాతం వడ్డీని చెల్లిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.