ETV Bharat / business

భారత వృద్ధిరేటు 7 శాతమే.. అంచనాలను తగ్గించిన ఫిచ్‌

భారత జీడీపీ వృద్ధిరేటు అంచనాలను అమెరికా క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ 7.8 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు నెమ్మదించడం, ద్రవ్యోల్బణం పెరుగుదల, కఠిన పరపతి విధాన నిర్ణయాలే దీనికి కారణమని పేర్కొంది.

Fitch India Rating
Fitch India Rating
author img

By

Published : Sep 15, 2022, 2:24 PM IST

Fitch India Rating: ప్రముఖ రేటింగ్స్‌ సంస్థ ఫిచ్‌... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ వృద్ధిరేటు అంచనాను 7 శాతానికి తగ్గించింది. జూన్‌లో 7.8 శాతంగా ఉంటుందని అంచనా వేసిన ఫిచ్‌.. తాజాగా దానిని సవరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనాను కూడా తగ్గించింది. గతంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేసిన ఫిచ్‌.. తాజాగా దానిని 6.7 శాతానికి తగ్గించింది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు.. అధిక ద్రవ్యోల్బణం, ఆర్​బీఐ వడ్డీరేట్ల పెంపు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అంచనాలను వెల్లడించినట్లు ఫిచ్‌ తెలిపింది. ఏప్రిల్‌-జూన్ త్రైమాసికంలో వృద్ధి రేటును 18.5 శాతంగా గతంలో అంచనా వేసినప్పటికీ.. అది 13.5 శాతానికే పరిమితమైనట్లు గుర్తుచేసింది.

ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఇదీ..
ప్రపంచవ్యాప్తంగా 2022-23లో జీడీపీ 2.4 శాతంగా ఉంటుందని ఫిచ్‌ లెక్కగట్టింది. జూన్‌ అంచనాలతో పోలిస్తే 0.5 శాతం కోత విధించింది. వచ్చే ఏడాది వృద్ధి రేటులోనూ ఒక శాతం కోతపెట్టి 1.7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. యూరోప్రాంతం, యూకే ఈ ఏడాది చివరకు ఆర్థికమాంద్యంలోకి జారుకుంటాయని ఫిచ్‌ వెల్లడించింది. అమెరికా 2023 మధ్య నాటికి స్వల్ప మాంద్యంలోకి వెళ్తుందని చెప్పింది.

ఇవీ చదవండి: లక్ష రూపాయల ల్యాప్‌టాప్‌.. రూ.40వేలకే.. ఎలాగో తెలుసా?

ఎస్‌బీఐ @ రూ.5 లక్షల కోట్లు.. టాప్ 10లో ఏడో స్థానానికి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.