ETV Bharat / business

Family Floater Health Insurance Plan : ఈ హెల్త్ పాలసీ చూశారా..? పుట్టిన పిల్లలకు కవరేజీ నుంచి మరెన్నో బెనిఫిట్స్!

Family Floater Health Insurance Policy : ప్రస్తుత రోజుల్లో కుటుంబానికి ఆరోగ్య బీమా అనివార్యంగా మారింది. అయితే.. ఏ పాలసీ తీసుకోవాలనే చాలా మంది అయోమయానికి గురవుతుంటారు. మీ అవసరాలను.. పరిస్థితులను ఆలోచించి పాలసీ తీసుకోవాలని సూచిస్తుంటారు నిపుణులు. ఈ నేపథ్యంలో.. ఈ పాలసీపై ఓ లుక్కేయండి.

Family Floater Health Insurance Plan
Family Floater Health Insurance Plan
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2023, 3:23 PM IST

Family Floater Health Insurance Plan : ఊహించ‌ని అనారోగ్య సమస్యల వల్ల సంభ‌వించే ఆర్ధిక క‌ష్టాల నుంచి ఫ్యామిలీని ర‌క్షించుకోవాలంటే.. హెల్త్ ఇన్సూరెన్స్ అనివార్యంగా మారింది. దాంతో చాలా మంది ఆరోగ్య బీమా తీసుకోవడానికి ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో.. ఎలాంటి పాలసీ తీసుకుంటే పుట్టిన పిల్లల నుంచి ఫ్యామిలీ మొత్తానికి ఆరోగ్య బీమా లభిస్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Family Floater Health Insurance Plan : సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లలకు.. ప్రసూతి ప్రయోజనాలు కలిగి ఉండే ఇన్సూరెన్స్ పాలసీలన్నీ కవరేజ్ అందిస్తుంటాయి. పాలసీదారులు దీనికోసం ఎలాంటి అదనపు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ.. 90వ రోజు తర్వాత రక్షణ కొనసాగుతుందని నిర్ధారించుకోవడానికి.. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ(Family Floater Health Insurance)లో చేర్చాల్సి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత వారు 25 సంవత్సరాలు నిండిన తర్వాత లేదా పెళ్లి చేసుకున్న తర్వాత.. వారు ప్రత్యేక, స్వతంత్ర ఆరోగ్య బీమా ప్లాన్ పొందడానికి మరో కొత్త పాలసీ తీసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి.. కుటుంబం మొత్తానికి ఆరోగ్య బీమా తీసుకోవాలనుకుంటే తక్కువ ఖర్చుతో కూడిన ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్(Family Floater Plan)ను కొనుగోలు చేయడం ఉత్తమమైనదిగా నిపుణులు సూచిస్తున్నారు.

Family Floater Policy Benefits : ప్రస్తుతం దేశంలో కుటుంబ ఆరోగ్య రక్షణ కోసం అందుబాటులో ఉన్న ప్రత్యేకమైన ఆఫర్లలో ఫ్యామిలీ ఫ్లోటర్ కవర్ ఒకటి. చాలా దేశాల్లో ఈ ప్లాన్ అస్సలు కనిపించదు. కుటుంబం పట్ల మన దేశ సంస్కృతిని కూడా ఈ హెల్త్​ ఇన్సూరెన్స్ పాలసీ సూచిస్తుంది. తల్లిదండ్రులతోపాటు తాతలను కూడా చేర్చేందుకు కొన్ని కంపెనీలు వెసులుబాటు కల్పిస్తున్నాయి. అయితే.. యుక్త వయస్సులో తల్లిదండ్రులైన వారు ముందుగా రూ.10 లక్షల కవరేజీతో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం ఉత్తమం. అలాగే కంపెనీలు పాలసీ ప్రీమియం నిర్ణయించే సమయంలో మొత్తం కుటుంబసభ్యుల వయస్సును పరిగణనలోకి తీసుకుంటాయి. అందులో పెద్ద సభ్యుని వయస్సు ప్రీమియం రేట్లను నిర్ణయించడంలో కీలకమైన అంశంగా మారుతుంది.

మీ ఫ్లోటర్ ఫ్యామిలీ పాలసీ ప్రసూతి ప్రయోజనాలను కూడా అందిస్తే.. డెలివరీకి సంబంధించిన ఏవైనా సమస్యలు లేదా మరేదైనా షరతు ఎదురైనప్పుడు.. మీ నవజాత శిశువు చికిత్స కూడా ఈ ప్లాన్ కింద డెలివరీ తర్వాత 90 రోజుల వరకు చెల్లించబడుతుంది. అలాగే మీకు పుట్టిన శిశువును ఫ్లోటర్ ఫ్యామిలీ ప్లాన్ లో చేర్చటం ద్వారా భారత ప్రభుత్వం.. జాతీయ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ సూచించిన విధంగా ఆరోగ్య బీమా సంస్థలు శిశువు ప్రారంభ టీకా ఖర్చులను కూడా చెల్లిస్తాయి. మీరు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. చాలా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్​లు 25 సంవత్సరాలు పైబడిన పిల్లలకు కవర్ అందించవు. అంటే పాతికేళ్లు దాటిన వారు ఈ పాలసీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుందనే విషయం మీరు గమనించాలి.

SBI General Insurance New Health Policy : సూపర్ హెల్త్ ఇన్సూరెన్స్​ పాలసీ.. అన్​లిమిటెడ్ రీఫిల్స్​.. 3X బెనిఫిట్స్​!

Best Post Office Insurance Schemes : 299 రూపాయలకే.. రూ.10లక్షల జీవిత బీమా!

హెల్త్​ ఇన్సూరెన్స్​ తీసుకుంటారా?.. ఈ విషయాలు మస్ట్​గా తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.