Best Financial Goals For 2024 : చేతినిండా డబ్బులతో.. మంచి జీవితాన్ని కొనసాగించాలని చాలా మంది అనుకుంటారు. ఆ మేరకు సంపాదిస్తారు కూడా. కానీ.. సరైన ప్లాన్ లేకపోవడంతో లక్ష్యం నెరవేరదు. మీరు కూడా ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నట్టయితే.. ఈ కొత్త ఏడాదిలో తప్పకుండా 5 ఫైనాన్షియల్ గోల్స్ పెట్టుకోండి. మీ లక్ష్య సాధనలో ఎంతో ముందుకు దూసుకెళ్తారు!
కంప్లీట్ బడ్జెట్ ప్యాకేజ్ : మీ ఆదాయం, ఖర్చులు, పొదుపు.. ఈ మూడు వాటాలతో నెలవారీ బడ్జెట్ తయారు చేయండి. ఆదాయం ఎంత వచ్చినా సరే.. సంపాదనలో కచ్చితంగా 30 శాతం పొదుపు చేయాల్సిందే. అందులో నుంచి డబ్బు తీయడానికి వీళ్లేదు. మిగిలిన సొమ్మునుంచే అవసరాలన్నీ తీరిపోయేలా బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి.
ఎమర్జెన్సీ ఫండ్ : జీవితం చాలా చిన్నది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కొన్ని సందర్భాల్లో అనుకోని ఘటనలు జరగొచ్చు. సడన్‌గా మనం ఎక్స్ పెక్ట్ చేయని ఖర్చులూ ఎదురుకావొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి.. తప్పకుండా ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఇందుకోసం ప్రతినెలా కొంత మొత్తాన్ని పక్కన పెట్టండి.
5 Biggest Financial Mistakes: మీ ఆర్థిక ప్రణాళికను దెబ్బతీసే.. 5 పొరపాట్లు ఇవే!
అదనపు ఆదాయం : ఏటికేడు అవసరాలు పెరుగుతుంటాయి. ఖర్చులూ పెరిగిపోతుంటాయి. కాబట్టి.. అదనపు ఆదాయం పొందడం కోసం అణ్వేషించాలి. మీకు ఆసక్తి ఉన్న రంగంలో పార్ట్ టైమ్ జాబ్ చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందండి. లైఫ్‌లో క్రమబద్ధమైన ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది.
రిటైర్‌మెంట్ ప్లాన్‌లో పెట్టుబడి : మీ ఆర్థిక భవిష్యత్తును భద్రంగా ఉంచడానికి.. రిటైర్‌మెంట్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. అందుకే.. సురక్షితమైన రిటైర్‌మెంట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు కచ్చితమైన ఫైనాన్స్‌ను క్రమబద్ధీకరించుకోవాలి. మీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా.. లాంగ్ టర్మ్ పెట్టుబడి పెట్టేలా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పటి వరకూ ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించకపోతే 2024లో.. ఏదైనా రిటైర్‌మెంట్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టండి.
జీవిత బీమా ప్లాన్ : మీరు ఉన్నంత వరకూ కుటుంబానికి పెద్దగా చింత ఉండదు. కానీ.. ఊహించని విధంగా ఉన్నట్టుండి దూరమైతే మీ పైన ఆధారపడిన వారు అన్యాయమైపోతారు. అందుకే.. వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జీవిత బీమా ప్లాన్ తీసుకోవడం తప్పని సరి. ఏదైనా ఘోరం జరిగిపోతే.. కష్టకాలంలో మీ కుటుంబానికి ఆర్థిక రక్షణగా బీమా నిలుస్తుంది. అందుకే.. తప్పకుండా మీ స్థాయిలో లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోండి. ఈ కొత్త సంవత్సరంలో ఈ 5 ఫైనాన్షియల్ గోల్స్ సెట్ చేసుకోండి. పూర్తి చేయండి. తప్పకుండా మీ భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తాయి.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల ఆఫర్ - ఫిక్స్డ్ డిపాజిట్లపై అదిరిపోయే వడ్డీ రేట్లు!
జీవిత ప్రయాణం సాఫీగా సాగాలంటే.. ఆర్థిక ప్రణాళిక వేసుకోండిలా...