Best Cashback Offers on Credit Cards : ఏదైనా పండుగ సీజన్ వస్తే చాలు ఈ- కామర్స్ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు రకాల ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. అలాగే బ్యాంకులు కూడా క్రెడిట్‌కార్డ్ వినియోగదారుల కోసం అదిరిపోయే క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందిస్తున్నాయి.
ఎస్బీఐ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్
Cashback SBI Credit Card Benefits :
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అందించే ఈ క్యాష్‌బ్యాక్ కార్డ్‌తో ఆన్లైన్లో ఏదైనా కొనుగోలు చేస్తే 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఆఫ్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌పై 1 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఒకవేళ మీరు ఒక నెలలో ఆన్లైన్లో రూ.20,000, మిగిలిన రూ.80,000 ఆఫ్‌లైన్‌లో ఖర్చు చేస్తే మొత్తంగా రూ.21,600 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
హెచ్డీఎఫ్సీ మిలీనియా క్రెడిట్ కార్డు
HDFC Millenia Credit Card Benefits : ఈ క్రెడిట్ కార్డుతో అమెజాన్, బుక్ మై షో, కల్ట్‌ఫిట్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, సోనీ లీవ్, స్వీగ్గీ, ఉబర్, జొమాటో లాంటి సైట్లలో కొనుగోలు చేస్తే 5 శాతం వరకు, ఇతర ఖర్చులపై 1% వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ప్రతినెలా రూ.20 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చు చేస్తే వార్షిక క్యాష్‌బ్యాక్ రూ.21,600 వరకు లభిస్తుంది.
యాక్సిస్ బ్యాంక్ ఏసీఈ క్రెడిట్ కార్డ్
Axis Bank ACE Credit Card Benefits : ఈ క్రెడిట్ కార్డుతో చేసే బిల్ పేమెంట్లపై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. స్విగ్గీ, జొమాటో, ఓలా యాప్‌ల్లో చేసే ఖర్చులపై 4 శాతం, ఇతర ఖర్చులపై 2 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలానే ప్రతి నెలా బిల్ పేమెంట్లపై రూ.10 వేల వరకు ఖర్చు చేస్తే 4శాతం, ఇతర ఖర్చులపై రూ.90 వేల వరకు వినియోగిస్తే, సంవత్సరానికి క్యాష్‌బ్యాక్ కింద రూ.20,400 వరకు వస్తుంది.
ఐసీఐసీఐ అమెజాన్ పే క్రెడిట్ కార్డు
ICICI Amazon Pay Credit Card Benefits : ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉన్నవారు ఈ కార్డుతో అమెజాన్ ఇండియాలో పాషింగ్ చేస్తే 5 శాతం, అమెజాన్ పే చెల్లింపులపై 2 శాతం, ఇతర ఖర్చులపై 1 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. అమెజాన్ ఇండియాలో గరిష్ఠంగా రూ.10 వేలు, ఇతర ప్లాట్‌ఫారమ్‌లో గరిష్ఠంగా రూ.20,000 నుంచి రూ.70,000 వరకు ఖర్చు చేస్తే, సంవత్సరానికి రూ.19,200 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
స్టాండర్డ్ చార్టర్డ్ అల్టిమేట్ క్రెడిట్ కార్డ్
Standard Chartered Ultimate Credit Card Benefits : ఈ కార్డుతో ఆన్లైన్ ఖర్చులపై 2 శాతం, ఇతర ఖర్చులపై 1 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. ప్రతి నెలా ఆన్లైన్లో గరిష్ఠంగా రూ.50 వేలు, ఇతర పద్ధతుల్లో రూ.50 వేలు ఖర్చు చేస్తే, సంవత్సరానికి రూ.18 వేల వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది.
మీ క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాలా? పాన్ కార్డ్‌తో సింపుల్‌గా చెక్ చేసుకోండిలా!
క్రెడిట్ కార్డు బిల్లు అధికంగా చెల్లిస్తున్నారా? ఇకపై అలా కుదరదు!