Best Cars Under 10 Lakh With 6 Airbags : భారతదేశంలో నేడు కార్ల వాడకం విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతివారు కొత్త కార్లు కొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తక్కువ బడ్జెట్లో మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్న కార్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి.
భద్రత ముఖ్యం!
ట్రాఫిక్ సమస్యలు, వాహన ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. నేడు ప్రతి ఒక్కరూ మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్న వాహనాలు కొనుగోలు చేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు.. మంచి క్రాష్ టెస్ట్ రేటింగ్‌తో, మెరుగైన NCAP స్కోర్‌తో, సేఫ్టీ ఫీచర్లతో కార్లను రూపొందిస్తున్నాయి.
బడ్జెట్లో - బెస్ట్ సేఫ్టీ కార్స్!
Best Safety Cars Under 10 Lakhs : మారుతి సుజుకి, హ్యుందాయ్ కంపెనీలు రూ.10 లక్షల బడ్జెట్లో 6-ఎయిర్ బ్యాగ్స్ ఉన్న కార్లను అందిస్తున్నాయి. భద్రతాపరంగా ఇవి బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పవచ్చు. అందుకే వాటిపై ఓ లుక్కేద్దాం రండి.
Maruti Suzuki Baleno Features :
- మారుతి సుజుకి బాలెనో స్టాండర్డ్ వేరియంట్లో 2 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి.
- బాలెనో జెటా పెట్రోల్ MT వేరియంట్ నుంచి 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి.
- ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు.. సిగ్మా, డెల్టా, జెటా, ఆల్ఫా అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.
- మారుతి సుజుకి బాలెనో కారు పెట్రోల్ పవర్ట్రైన్, CNG పవర్ట్రైన్ ఆప్షన్లలో లభిస్తుంది.
Maruti Suzuki Baleno Price : మారుతి సుజుకి బాలెనో కారు ప్రారంభ ధర రూ.8.30 లక్షలు (ఎక్స్-షోరూం) వరకు ఉంటుంది.
Hyundai i20 Features :
- హ్యుందాయ్ కంపెనీ ఈ సెప్టెంబర్ నెలలో Hyundai i20 కారును పరిచయం చేసింది. హ్యుందాయ్ ఐ20 కారులో 6-ఎయిర్‌బ్యాగ్స్ సహా పలు అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
- హ్యుందాయ్ కంపెనీ ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో, పలు సేఫ్టీ ఫీచర్లతో ఈ కారును రూపొందించింది.
- ఈ హ్యుందాయ్ ఐ20 కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు.
- ఇది అమెజాన్ గ్రే, అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, టైఫూన్ సిల్వర్, స్టారీ నైట్, ఫియరీ రెడ్, అట్లాస్ వైట్+ బ్లాక్ రూఫ్, ఫైరీ రెడ్+ బ్లాక్ రూఫ్ లాంటి స్టన్నింగ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
Hyundai i20 : ఈ హ్యుందాయ్ ఐ20 కారు ధర సుమారుగా రూ.7 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది.
Hyudai Aura Features : హ్యుందాయ్ కంపెనీ తమ కార్లు అన్నింటికీ స్టాండర్డ్‌గా 6-ఎయిర్‌బ్యాగ్‌లను అందించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే హ్యుందాయ్ ఆరా కారును ఇటీవలే 6-ఎయిర్‌బ్యాగ్స్‌కు అప్‌గ్రేడ్ చేశారు. దీనితో Hyudai Aura.. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, వెన్యూ, అల్కాజర్ కార్ల సరసన చేరింది.
Hyudai Aura Price : హ్యుందాయ్ ఆరా కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఎంట్రీ లెవెల్ - పెట్రోల్ MT కారు ధర రూ.6.44 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది.
Hyundai Exter Features : హ్యుందాయ్ ఎక్స్టర్లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ కారు 5 వేరియంట్స్‌లో, 9 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రధానంగా ఈ కారు... టాటా పంచ్, సిట్రోయెన్ సీ3 కార్లతో నేరుగా పోటీ పడుతోంది.
Hyundai Exter Price : ఈ హ్యుందాయ్ ఎక్స్టర్ కారులో కూడా 6-ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. ఈ కారు బేస్ మోడల్ ధర రూ.6 లక్షలు (ఎక్స్-షోరూం) వరకు ఉంటుంది.
Hyundai Grand i10 Nios Features : హ్యుందాయ్ కంపెనీ తమ కారు మోడల్స్ అన్నింటికీ స్టాండర్డ్‌గా 6-ఎయిర్‌బ్యాగ్స్ అందిస్తామని ఇటీవలే ప్రకటించింది. కనుక హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్లోనూ కచ్చితంగా 6-ఎయిర్‌బ్యాగ్స్ అందిస్తోంది. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు.
Hyundai Grand i10 Nios Price : హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారు ధర రూ.5.84 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది.
హోండా, సిట్రోయెన్ దీపావళి ఆఫర్స్ - ఆ కారుపై ఏకంగా రూ.1,00,000 డిస్కౌంట్!