Bank of Baroda Student Special Account : కస్టమర్లను ఆకట్టుకోవడానికి అన్ని బ్యాంకులూ సరికొత్త నిర్ణయాలు ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) ఈ మధ్యకాలంలో "లైట్ సేవింగ్స్ అకౌంట్" పేరిట లైఫ్‌టైమ్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా.. ఫ్యామిలీ మెంబర్స్ కోసం "బీఓబీ పరివార్ అకౌంట్"ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా విద్యార్థుల కోసం.. జీరో బ్యాలెన్స్ సదుపాయంతో స్పెషల్ సేవింగ్స్ అకౌంట్ తీసుకొచ్చింది. ఈ అకౌంట్‌తో స్టూడెంట్స్ అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చని బ్యాంక్ ప్రకటించింది. ఇంతకీ ఆ అకౌంట్ ఏమిటి? దాని ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
BoB Bro Savings Account : విద్యార్థుల కోసం జీరో బ్యాలన్స్ సదుపాయంతో.. బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకొచ్చిన ఆ స్పెషల్ అకౌంటే.. "బ్రో సేవింగ్స్ అకౌంట్". 16 ఏళ్ల నుంచి 25 సంవత్సరాల లోపు ఉండే విద్యార్థుల అవసరాలకు తగినట్లుగా ఈ అకౌంట్‌ను అందిస్తున్నట్లు బీఓబీ తెలిపింది. స్టూడెంట్స్ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా దీన్ని రూపొందించామని చెప్తోంది. ఈ అకౌంట్ తీసుకున్న విద్యార్థులకు జీవిత కాలం పాటు కాంప్లిమెంటరీ డెబిట్ కార్డు సహా ఇతర ప్రయోజనాలనూ అందిస్తున్నట్లు బీఓబీ పేర్కొంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్‌న్యూస్- కుటుంబం మొత్తానికి ఒకే అకౌంట్! కళ్లు చెదిరే బెనిఫిట్స్!
బ్రో సేవింగ్స్ అకౌంట్ ప్రయోజనాలు..
- ఈ అకౌంట్ ద్వారా రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డు పొందవచ్చు. ఈ కార్డు వాడే వారికి ప్రముఖ బ్రాండ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు లభిస్తాయి.
- అలాగే ప్రతి ఏటా రెండు సార్లు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ లభిస్తుంది.
- ఇది తీసుకున్న విద్యార్థులకు రూ.2 లక్షల వరకు ఉచితంగా వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ దక్కుతుంది.
- ఈ అకౌంట్‌తో ఆటో స్వీప్ ఫెసిలిటీ కూడా ఉంటుంది.
- ఈ అకౌంట్ ద్వారా అపరిమితమైన చెక్ బుక్స్ తీసుకోవచ్చు.
- అలాగే ఉచితంగా ఎస్ఎంఎస్, ఈమెయిల్ అలర్ట్స్ పొందవచ్చు.
- డీమ్యాట్ ఏఎంసీ పై 100 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
- దీని ద్వారా ఎడ్యుకేషనల్ లోన్స్ పొందాలనుకుంటే.. ఆ లోన్స్ పై వడ్డీ రాయితీ లభిస్తుంది. ఇంకా.. జీరో ప్రాసెసింగ్ ఫీజు అప్లై అవుతుంది.
- ఎడ్యుకేషన్ లోన్స్‌పై వడ్డీ రేటులో 0.15 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది.
- అర్హులైన వారికి ఆకర్షణీయమైన ఆఫర్లతో కూడిన క్రెడిట్ కార్డులు కూడా ఇస్తారు.
ఈ అకౌంట్‌ను యువతకు చేరువ చేసేందుకుగాను ఐఐటీ బాంబేకి చెందిన మూడ్ ఇండిగోను ఎక్స్‌క్లూజివ్ బ్యాంకింగ్ పార్ట్నర్గా బ్యాంక్ ఆఫ్ బరోడా నియమించుకుంది. ప్రస్తుత ప్రపంచం వేగంగా మారిపోతున్న క్రమంలో న్యూ జనరేషన్ కస్టమర్లకు చేరువయ్యేందుకు ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని బీఓబీ పేర్కొంది.
మహిళలకు గుడ్‌న్యూస్- ఆ బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేస్తే రూ.కోటి ఇన్సూరెన్స్ కవరేజ్!
ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉండొచ్చు? ఎక్కువ ఉంటే ఏమవుతుంది?