ETV Bharat / business

ఫైనాన్స్​లో కారు కొనేటప్పుడు చేసే పొరపాట్లు ఇవే - ఆర్థికంగా చాలా నష్టం! - Most Common Car Finance Mistakes

Car Finance Mistakes : మీరు కొత్త కారు తీసుకునే ఆలోచనలో ఉన్నారా? కానీ.. నచ్చిన మోడల్ తీసుకోవడానికి సరిపడా డబ్బులు లేక ఫైనాన్స్​లో తీసుకునేందుకు సిద్ధమయ్యారా? మరి.. ఫైనాన్స్​కు వెళ్లే ముందు.. ఈ విషయాలు తెలుసుకున్నారా? లేదంటే.. ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది!

Car Finance
Avoid These Mistakes on Car Finance
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2024, 4:42 PM IST

Avoid These Mistakes on Car Finance : కారు కొనుగోలు చేయడానికి ముందుగా ఓ బడ్జెట్ అనుకుంటే.. షోరూమ్​కు వెళ్లిన తర్వాత పరిస్థితి మారిపోతుంది. మరో మోడల్ నచ్చుతుంది. లేదంటే బ్రాండే మార్చాల్సి వస్తుంది. అప్పుడు బడ్జెట్ పెరిగిపోతుంది. దీంతో.. అనివార్యంగా ఫైనాన్స్ వైపు చూస్తారు. చాలా మంది ఈ పరిస్థితిని ఎదుర్కొంటారు. అయితే.. ఈ టైమ్​లో అవగాహనా లోపంతో ఆర్థికంగా నష్టపోతుంటారు. అందుకే.. ఈ పొరపాట్లు చేయకండి.

బడ్జెట్ క్లారిటీ : ఫైనాన్స్​లో కారు కొనుగోలు చేసే ముందు మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయండి. నెలవారీ చెల్లింపులపై మీరు ఎంత ఖర్చు చేయగలరో క్లారిటీ తెచ్చుకోండి. ఇది దీర్ఘకాలం సాగే ప్రక్రియ కాబట్టి.. చెల్లింపుల్లో విఫలమైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.

ఆఫర్‌లను కంపేర్ చేయండి : మీరు చూసే మొదటి ఫైనాన్సింగ్ ఆప్షన్ వద్దే ఉండిపోకూడదు. వివిధ కంపెనీలు, డీలర్‌షిప్‌ల వద్ద వడ్డీ రేట్లు, రుణ నిబంధనలు, షరతులను తెలుసుకోండి. వివిధ సంస్థల ఆఫర్​లను సరిపోల్చడానికి కొంత సమయాన్ని వెచ్చించాలి. ఇలా చేయడం ద్వారా మీకు ఆర్థికంగా కొంత ఆదా అవుతుంది. చాలా మంది ఇది ఫాలో అవ్వరు.

నెలవారీ చెల్లింపులే కాదు : నెలవారీ EMI ముఖ్యమైన అంశమే అయినప్పటికీ.. మొత్తం రుణం పరిగణనలోకి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. దీర్ఘకాల రుణ నిబంధనలతో తక్కువ నెలవారీ చెల్లింపు ఆప్షన్​ ఇవ్వొచ్చుకానీ.. కాలక్రమేణా ఎక్కువ వడ్డీని వసూలు చేస్తాయి. కాబట్టి తిరిగి చెల్లించే మొత్తాన్ని కూడా లెక్కించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.

Car Loan Precautions : కార్​ లోన్ కావాలా?.. ఈ టిప్స్​ పాటిస్తే తక్కువ వడ్డీతో.. లోన్ గ్యారెంటీ!

క్రెడిట్ స్కోర్‌ను విస్మరించడం : కారు లోన్‌పై మీరు పొందే వడ్డీ రేటును నిర్ణయించడంలో మీ క్రెడిట్ స్కోర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఫైనాన్సింగ్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు మీ క్రెడిట్ నివేదికను చెక్ చేసుకోవాలి. అవసరమైతే మీ క్రెడిట్‌ను మెరుగుపరచుకోవాలి. ఎందుకంటే అధిక క్రెడిట్ స్కోర్ మెరుగైన రుణ నిబంధనలను పొందడంలో సహాయపడుతుంది.

ఫైన్ ప్రింట్ చదవకపోవడం : నిబంధనలు, షరతులను జాగ్రత్తగా చదవకుండా, అర్థం చేసుకోకుండా ఎలాంటి ఫైనాన్సింగ్ ఒప్పందాలపై సంతకం చేయవద్దు. వడ్డీ రేట్లు, ఎర్లీ రీపేమెంట్ పెనాల్టీలు, ఫీజులు, ఇతర హిడెన్ ఖర్చుల వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి. ఏదైనా అస్పష్టంగా ఉంటే.. కంపెనీ వివరణ కోరాలి.

అనవసరమైన యాడ్-ఆన్స్ : ఫైనాన్సింగ్ ప్రక్రియ సమయంలో విక్రయదారులు మీకు కొన్ని అనవసరపు యాడ్ ఆన్స్ కట్టబెట్టే ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో మీరు వాటిని జాగ్రత్తగా పరిశీలించి అవి నిజంగా అవసరమా లేదా? అని నిర్ధారించుకోవాలి. అవసరమైన వాటిని మాత్రమే తీసుకోవాలి.

తొందరపాటు తగదు : కారు కొనడం అనేది ఒక ముఖ్యమైన ఫైనాన్షియల్ కమిట్​మెంట్. కాబట్టి ఆ నిర్ణయాన్ని తొందరపాటుతో తీసుకుంటే.. తర్వాత పశ్చాత్తాపానికి దారితీస్తుంది. అందుకే.. ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు కొంత వెయిట్ చేయండి. పైన చెప్పిన విషయాలన్నీ ఓకే అనుకున్నప్పుడే ఫైనాన్స్ పత్రాలపై సంతకం చేయండి.

Buy Second Hand Car Online : ఈజీ రిజిస్ట్రేషన్​తో సెకెండ్​ హ్యాండ్ కారు కొనాలా?.. టాప్​ 10 వెబ్​సైట్స్​ ఇవే..!

Car Buying Tips : కొత్త కారు కొనాలా? లేక పాతదా? ఏది బెటర్​ ఆప్షన్​?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.