ETV Bharat / business

'ఆకాశ ఎయిర్' సేవలు షురూ.. అహ్మదాబాద్​కు తొలి ఫ్లైట్ - రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా

AKASA AIR NEWS: దేశంలో కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ఆదివారం జెండా ఊపి సర్వీసుల్ని ప్రారంభించారు. తొలి విమానం ముంబయి నుంచి అహ్మదాబాద్​ వెళ్లింది

Aviation Minister Scindia flags off Akasa
ఆకాశ ఎయిర్‌ సేవలను ప్రారంభించిన కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా
author img

By

Published : Aug 7, 2022, 1:41 PM IST

AKASA AIR NEWS: దేశంలో కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌ సేవలు అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ఆదివారం జెండా ఊపి సర్వీసుల్ని ప్రారంభించారు. ముంబయి నుంచి బయలుదేరిన తొలి విమానం అహ్మదాబాద్‌ వెళ్లింది. జులై 7న ఈ సంస్థ 'డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌' నుంచి సేవలు ప్రారంభించేందుకు అధికారిక అనుమతులైన 'ఆపరేటర్‌ సర్టిఫికేట్‌' పొందింది. ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా, ఏవియేషన్‌ రంగ నిపుణులు ఆదిత్య ఘోష్‌, వినయ్‌ దూబే కలిసి ఆకాశ ఎయిర్‌ సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ప్రారంభోత్సవం సందర్భంగా ముంబయి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఝున్‌ఝున్‌వాలా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. "ఈ సందర్భంగా నేను మీకు (సింధియా) కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారత్‌లో ప్రభుత్వ అనుమతులు రావాలంటే చాలా జాప్యం జరుగుతుందన్న అపోహ ఉంది. కానీ, పౌరవిమానయాన శాఖ మాకు అందించిన సహకారం అద్భుతం. ప్రపంచంలో బహుశా ఏ విమానయాన సంస్థ ఏర్పాటైన 12 నెలల్లో సేవలు ప్రారంభించలేదు. ప్రభుత్వ సహకారం లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు" అని ఝున్‌ఝున్‌వాలా అన్నారు.

భారత పౌరవిమానయానంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైందని కేంద్ర మంత్రి సింధియా అన్నారు. "ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం గత దశాబ్దకాలంగా తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు ఈ రంగంలోకి అనేక కొత్త సంస్థలు వినూత్న ఐడియాలతో ప్రవేశించాయి. కానీ, గత పదేళ్లలో అనేక సంస్థలు మూతపడ్డాయి. ఈ తరుణంలో ఆకాశ ఎయిర్‌ తన సేవల్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో విమానయాన చరిత్రలో కొత్త శకం ప్రారంభమైందని భావిస్తున్నాను. మోదీ దూరదృష్టి వల్ల విమాన సేవలు అట్టడుగు వర్గాలకు కూడా చేరువయ్యాయి. గతంలో విమాన ప్రయాణం సంపన్న వర్గాలకు మాత్రమే చెందినదిగా భావించేవారు. కానీ, ఇప్పుడు చెప్పులు వేసుకునే వ్యక్తి కూడా విమానంలో ప్రయాణించొచ్చు. గత ఎనిమిదేళ్లలో చాలా మార్పు వచ్చింది" అని సింధియా అన్నారు.

ఆకాశ ఎయిర్‌ నుంచి ఆగస్టు 13న బెంగళూరు-కొచ్చి, ఆగస్టు 19న బెంగళూరు-ముంబయి, సెప్టెంబరు 15న చెన్నై-ముంబయి మధ్య సేవలు నడవనున్నాయి. రెండు బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలతో తమ వాణిజ్య కార్యకలాపాలకు కంపెనీ శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది బోయింగ్‌ నుంచి ప్రతినెలా తమ కంపెనీకి రెండు కొత్త విమానాలు అందుతాయని ఆకాశ ఎయిర్‌ గతంలో పేర్కొంది. మొత్తం 72 మ్యాక్స్‌ విమానాల కోసం కంపెనీ గత ఏడాది నవంబరులో బోయింగ్‌తో కొనుగోలు ఒప్పందం కుదుర్చుకొంది.

ఇవీ చదవండి: 'మెటావర్స్​ సేవలకు త్వరలో పైలట్ ప్రాజెక్ట్.. అన్ని రంగాలకు విస్తరణ'

పెరిగిన బ్యాంకు రుణాలు.. గతేడాది కంటే 14 శాతం అధికం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.