Amazon Pay Rupay Credit Card EMI Offer : రూపే క్రెడిట్ కార్డ్‌లపై ఈఎమ్ఐ సదుపాయాన్ని కల్పిస్తోంది అమెజాన్ పే. పండగల వేళ ఆన్లైన్ షాపింగ్‌ను మరింత సులభతరం చేసుకునేందుకు ఈ విధానాన్ని తీసుకువచ్చింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్-2023 భాగంగా.. తమ వినియోగదారులకు దీన్ని పరిచయం చేసింది. 8 ప్రముఖ బ్యాంకులు జారీ చేసే రూపే క్రెడిట్ కార్డ్‌లపై ఈఎమ్ఐ సదుపాయాన్ని కల్పిస్తుంది అమెజాన్ పే.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) భాగస్వామ్యంతో.. రూపే క్రెడిట్ కార్డ్‌లపై ఈఎమ్ఐ సౌకర్యాన్ని తీసుకువచ్చినట్లు క్రెడిట్ అండ్ లెండింగ్, అమెజాన్ పే ఇండియా డైరెక్టర్ మయాంక్ జైన్ తెలిపారు. యూజర్లకు సులువుగా లోన్ అందించాలనే ఉద్దేశ్యంతో ఈ తరహా విధానాన్ని తీసుకువచ్చినట్లు ఆయన వివరించారు. దాంతోపాటు కస్టమర్లు తమ సేవింగ్స్‌ను పెంచుకునేందుకు ఇది సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా ఉన్న ఆన్లైన్ షాపింగ్ ప్రియులకు ఈ విధానం సౌకర్యంగా ఉంటుందని మయాంక్ జైన్ పేర్కొన్నారు. పండగ సీజన్ కావడం వల్ల ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. దాంతో పాటు డిజిటల్ పేమెంట్ విధానంలో చెల్లింపులు చేసే తమ కస్టమర్లకు వివిధ రకాల ఆఫర్లు, రివార్డ్‌లు కూడా అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇందుకోసం తమ యూజర్లు అమెజాన్ పే లేటర్, అమెజాన్ పే వాలెట్, యూపీఐ లాంటి డిజిటల్ పేమెంట్ విధానాలు అన్నింటీని వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు.
UPI Credit Line Facility : అకౌంట్లో డబ్బులు లేకపోయినా UPI పేమెంట్స్.. ఎలాగంటే?
UPI Credit Line Facility : మీరు అర్జెంట్‌గా ఎవరికైనా డబ్బులు పంపించాలా? కానీ మీ బ్యాంక్ అకౌంట్లో సరిపడా డబ్బులు లేవా? అయినా ఏ మాత్రం చింతించకండి. ఇప్పుడు మీరు సులువుగా.. మీ బ్యాంక్ అకౌంట్లో సరిపడా డబ్బులు లేకపోయినా.. యూపీఐ క్రెడిట్ లైన్స్ ద్వారా పేమెంట్స్ చేయవచ్చు. బ్యాంకులు అన్నీ యూపీఐ వినియోగదారులకు ముందస్తుగా క్రెడిట్ లైన్స్ జారీ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుమతి ఇచ్చింది. ఈ లేటెస్ట్ ఫెసిలిటీతో.. యూపీఐ వినియోగదారులకు బ్యాంకుల ద్వారా ముందస్తు క్రెడిట్ లైన్ లభిస్తుంది. అంటే లోన్ అమౌంట్ లభిస్తుంది. దీనిని ఉపయోగించి యూజర్లు తమ పేమెంట్స్ పూర్తి చేయవచ్చు. ఆ తరువాత నిర్దిష్ట సమయంలోపు ఆ క్రెడిట్ రుణాన్ని తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.