Jeep Launched Compass 2024 : మార్కెట్లోకి మరో కొత్త కారు ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్ ఇండియా నయా మోడల్ కారు "కంపాస్" 2024ను ఇటీవల లాంఛ్ చేసింది. గత మోడళ్ల కంటే తక్కువ ధరతో దీనిని విడుదల చేసింది. ఇంతకీ.. ఈ జీప్ కంపాస్ 2024 ఎలా ఉంది? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంత? మైలేజీ ఎంత ఇస్తుంది? వంటి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈ కారు 9-స్పీడ్ ఆటోమేటిక్ (AT) గేర్‌బాక్స్‌తో కూడిన డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. జీప్ 2024ను భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ల కోసం డెవలప్ చేశారు. ఈ కొత్త జీప్ కంపాస్ శ్రేణి ధర రూ.20.49 లక్షలతో ప్రారంభమవుతుంది. అలాగే ఎంట్రీ లెవల్ కారు ధర దాదాపు రూ.లక్ష వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎక్స్-షోరూం ఆటోమెటిక్ రేంజ్ కారు(AT) ధర మాత్రం రూ.23.99 లక్షలు నుంచి మొదలవుతుంది. అయితే.. గత మోడల్‌తో పోలిస్తే దీని ధర 20 శాతం మేర దిగి వచ్చింది. అంటే.. సుమారు 6 లక్షల రూపాయల మేర తగ్గింది.
కొత్త కంపాస్ SUV ఫీచర్లు ఇవే..
జీప్ కంపాస్ 2WD రెడ్ బ్లాక్ ఎడిషన్ SUV తొమ్మిది-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది.
2.0-లీటర్ డీజిల్ ఇంజన్(Diesel Engine)తో పనిచేస్తుంది.
ఈ ఇంజిన్ గరిష్ఠంగా 168 బీహెచ్‌పీ పవర్, 370 ఎన్ఎమ్ గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
ఈ కొత్త వేరియంట్ కారు 16.2 kmpl ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని జీప్ తెలిపింది.
ఈ జీప్ కంపాస్ నయా కారు 9.80 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకోగలదు.
జీప్ దేశంలో SUVకు సంబంధించి ఏ పెట్రోల్ వేరియంట్‌ను అందించడం లేదు.
సూపర్ కలర్..
జీప్ కంపాస్ 2024 మోడల్‌లో గ్లాసీ బ్లాక్ గ్రిల్, గ్లాసీ బ్లాక్ 18 ఇంచుల అలాయ్ వీల్స్
ఎల్ఈడీకి చెందిన ఫ్రంట్ రిఫ్లెక్టర్ హెడ్ లైట్స్, స్టాండర్డ్ టెయిల్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వంటి పీఛర్లు ఉన్నాయి.
బ్లాక్ షార్క్ ఎడిషన్‌లో అయితే బాడీ కలర్ పెయింటెడ్ రూఫ్ ఉంది.
లోయర్ క్లాడింగ్, బ్లాక్ లెదర్ సీట్స్, యూనిక్యూ ఇగ్నైట్ రెడ్ హైలైట్స్, స్ట్రైకింగ్ 18 ఇంచుల అల్యూమినియం బ్లాక్ గ్లాసీ పెయింటెడ్ వీల్స్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.
సరికొత్తగా మెరిడియన్ ఓవర్‌ల్యాండ్ SUV ఫీచర్లు : జీప్ ఇండియా మరో కొత్త వేరియంట్ కూడా తీసుకొచ్చింది. మూడు వరుసల జీప్ మెరిడియన్ ఓవర్ ల్యాండ్ ఎడిషన్ ఎస్‌యూవీని జీప్ తెచ్చింది. ఈ కొత్త వేరియంట్ స్ట్రైకింగ్ అప్‌డేట్స్ ఉన్నాయి. అప్‌డేటెడ్ గ్రిల్ ప్యాట్రన్, కొత్త అలాయ్ వీల్స్, బాడీ కలర్డ్ బంపర్స్, ఫ్రెష్ అప్‌హోల్‌స్టీరీ ఇన్‌సైడ్ లాంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. అయితే ఈ కొత్త జీప్ మెరిడియన్ వేరియంట్ ధరను కంపెనీ ప్రకటించలేదు.
Toyota Rumion MPV Launch : స్టన్నింగ్ ఫీచర్స్‌తో.. టయోటా రూమియన్ లాంఛ్.. ధర ఎంతంటే?