వారాంతాన్ని నష్టాలతో ముగించాయి సూచీలు. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 424 పాయింట్లు పతనమయి 36,546 వద్ద, నిఫ్టీ 125 పాయింట్లు క్షీణించి 10,943 వద్ద ట్రేడయ్యాయి.
మెటల్, ఆటోమెబైల్ రంగాల్లో ఆకస్మాత్తుగా సంభవించిన అమ్మకాలు సూచీల పతనానికి కారణమయయ్యాయి.
నేటి ట్రేడింగ్‌లో భారీ నష్టాలు మూటగట్టకున్న సంస్థలలో టాటామోటార్స్ మొదటి వరుసలో నిలిచింది. వేదాంత,టాటా స్టీల్స్, ఓఎన్జీసీ, ఎల్&టీ, కోల్ ఇండియా, మారుతీ,యాక్సిస్ బ్యాంక్ తరువాతి స్థానాల్లో నిలిచాయి.
కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, హెచ్‌సీఎల్, బజాజ్ లాభాల్లో గడించాయి. ఎఫ్‌సీజీ, ఫార్మా రంగ షేర్లకూ నేల చూపులు తప్పలేదు.
గురువారం నాటికి విదేశీ పెట్టుబడి దారులు 418 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారని బీఎస్ఈ తెలిపింది.
కారణాలేంటి?
⦁ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీకి ట్రంప్ విముఖత చూపడంతో వాణిజ్య యుద్ధం కొనసాగే అవకాశముందన్న సంకేతాలు మార్కెట్లో చక్కర్లు కొట్టాయి. ఆందోళనకు గురైన మదుపరులు అమ్మకాలు జరిపారు.
⦁ జపాన్,కొరియా సహా ఇతర అసియా మార్కెట్ల నష్టాలూ సూచీలను భయపెట్టాయి.
⦁ గత కొద్ది రోజులుగా తగ్గు ముఖంలో ఉన్న చమురు ధరలు స్వల్పంగా పెరగడమూ నష్టాలకు కారణం
రూపాయి బలపడింది
రూపాయి పుంజుకుంది. డాలర్‌తో పోలిస్తే నేడు 32 పైసలు బలపడి, మారకపు విలువ 71.13 వద్ద స్థిరపడింది.