ETV Bharat / business

ఉక్రెయిన్​- రష్యా చర్చలతో పుంజుకున్న సూచీలు.. సెన్సెక్స్​ 380 ప్లస్​

Stock Market Close: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 389 పాయింట్లు, నిఫ్టీ 135 పాయింట్లు లాభపడ్డాయి. ఉక్రెయిన్​, రష్యా మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మార్కెట్లు పుంజుకున్నాయి.

Stock market
Stock market
author img

By

Published : Feb 28, 2022, 3:50 PM IST

Updated : Feb 28, 2022, 4:34 PM IST

Stock Market Close: రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు పుంజుకున్నాయి. వారం తొలి సెషన్​లో మార్కెట్లు లోభాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 389పాయింట్లు పెరిగి 56,247 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో 16,794 వద్ద సెషన్​ను ముగించింది.

విద్యుత్​, లోహ, ఆయిల్​ గ్యాస్​ షేర్లు దన్నుతో సూచీలు చివరిలో పుంజుకున్నాయి.

ఇంట్రాడే సాగిందిలా..

రష్యా, ఉక్రెయిన్​ యుద్ధ భయాలతో సెన్సెక్స్​ ఉదయం 732 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. అయితే ఆ దేశాల మధ్య చర్చలతో అనుహ్యంగా పుంజుకుంది. ఇంట్రాడేలో 54,833 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. 56,324 వద్ద గరిష్ఠానికి చేరింది. 1,491 పాయింట్ల మధ్య కదలాడింది.

మరో సూచీ నిఫ్టీ 16,356 వద్ద కనిష్ఠం, 16,815 వద్ద గరిష్ఠానికి చేరింది.

లాభనష్టాల్లోని ఇవే..

టాటాస్టీల్​, పవర్​గ్రిడ్​, రిలయన్స్​, టైటాన్​, ఎన్​టీపీసీ, ఎల్​ అండ్​ టీ, ఏషియన్​పెయింట్​, ఐసీఐసీఐ బ్యాంకు, సన్​ఫార్మా, బజాజ్​ ట్విన్స్​, ఇన్ఫోసిస్​ కంపెనీల షేర్లు ప్రధానంగా లాభాపడ్డాయి.

డాక్టర్​రెడ్డీస్, ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, కొటక్​బ్యాంకు, ఇండస్ఇండ్​​బ్యాంకు షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

పుంజుకోవడానికి కారణాలివే..

ఉక్రెయిన్‌లో రష్యా దాడులు వరుసగా ఐదోరోజు కొనసాగుతున్నప్పటికీ దేశీయ సూచీలు సోమవారం సానుకూలంగా ముగిశాయి.

  • శాంతి చర్చలకు ఇరు దేశాలు అంగీకారం తెలపడం.. ఉక్రెయిన్‌లో రష్యా దాడుల తీవ్రత తగ్గిందన్న వార్తలు సూచీలకు కలిసొచ్చాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు.
  • కుప్పకూలుతున్న రష్యా కరెన్సీ రూబుల్‌కు దన్నుగా నిలిచేందుకు ఆ దేశం కీలక చర్యలు చేపట్టింది. బ్యాంకు వడ్డీ రేటు పెంచడం సహా బ్యాంకులపై ఆంక్షలను సడలించింది. ఇది కూడా సూచీలపై సానుకూల ప్రభావం చూపింది.
  • చమురు, గ్యాస్‌ ధరలు భారీగా పెరగగా.. ఆయా రంగాలకు చెందిన స్టాక్‌లు లాభపడ్డాయి.
  • ఐరోపా మార్కెట్లు, ఆసియా మార్కెట్లు, అమెరికా ఫ్యూచర్స్‌ అన్నీ నష్టాల్లోనే ఉన్నప్పటికీ.. దేశీయ మార్కెట్లు మాత్రం అందుకు భిన్నంగా రాణించాయి.

ఇదీ చూడండి: 'ఆఫీస్​లకు తర్వాత.. ముందు సిటీకి రండి'

Last Updated : Feb 28, 2022, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.