ETV Bharat / business

మార్కెట్లు నష్టాల్లో ఉన్నా రక్షణ రంగ షేర్ల దూకుడు

ఓవైపు దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోతున్న తరుణంలో రక్షణ రంగానికి చెందిన షేర్లు సుమారు 10 శాతం మేర వృద్ధి చెందాయి. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నియమాలను సవరిస్తూ.. 74 శాతానికి పెంచిన నేపథ్యంలో మదుపరులు ఈ సంస్థలవైపు మొగ్గుచూపారు.

Defence stocks in limelight
రక్షణ రంగ షేర్ల దూకుడు!
author img

By

Published : May 18, 2020, 12:48 PM IST

రక్షణ రంగానికి సంబంధించిన సంస్థల షేర్లు సోమవారం (మే18న) ప్రారంభ ట్రేడింగ్​లో సుమారు 10 శాతం మేర పుంజుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం రక్షణ ఉత్పత్తుల తయారీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నియమాలను సడలించి, నేరుగా పెట్టే పెట్టుబడులను 74 శాతానికి పెంచిన నేపథ్యంలో మదుపర్లు కొనుగోలుకు మొగ్గుచూపారు.

మార్కెట్లలో ప్రతికూల పవనాలు ఉన్నప్పటికీ.. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజీలోని హిందుస్థాన్​ ఏరోనాటిక్స్​ షేర్లు 10 శాతం, భారత్​ ఎలక్ట్రానిక్స్​ 5.53 శాతం, బీఈఎంఎల్​ 5.31 శాతం, ఆస్ట్రా మైక్రోప్రాడక్ట్స్​ 4.93 శాతం, భారత్​ డైనమిక్స్​ 4.71 శాతం మేర వృద్ధి చెందాయి.

ప్రస్తుత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్​డీఐ) విధానం ప్రకారం.. రక్షణ పరిశ్రమల్లో 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతులు ఉన్నాయి. 49 శాతం వరకు నేరుగా పెట్టుబడులు పెట్టొచ్చు. ఆపైన ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. నేరుగా పెట్టే పెట్టుబడులను 49 శాతం నుంచి 74 శాతానికి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఇటీవల ఆర్థిక ప్యాకేజీలో భాగంగా ప్రకటించారు. అయితే.. భద్రతాపరమైన అనుమతుల వంటివి ఎప్పటిలాగే ఉంటాయన్నారు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 776 పాయింట్ల నష్టంతో 30, 322 వద్ద కొనసాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.