టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) తగ్గింది. సెప్టెంబర్లో టోకు ద్రవ్యోల్బణం 10.66 శాతంగా నమోదైనట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఆగస్టులో టోకు ద్రవ్యోల్బణం 11.39 శాతంగా ఉంది. గత కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్న డబ్ల్యూపీఐ.. సెప్టెంబర్లో తగ్గినప్పటికీ.. వరుసగా ఆరో నెల రెండంకెలపైనే నమోదవడం గమనార్హం. 2020 సెప్టెంబర్లో 1.32 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం.. గత ఆగస్టు నాటికి 11.39 శాతానికి చేరింది.
ముడి పెట్రోలియం, లోహాలు, ఆహారేతర వస్తువులు, సహజ వాయువు, రసాయనాలు మొదలైన వాటి ధరల పెరుగుదల కారణంగానే.. ద్రవ్యోల్బణం రెండంకెలపైన ఉన్నట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇవీ చదవండి: