మహా నగరాలు దిల్లీ-ముంబయి మధ్య రూ. లక్ష కోట్లతో చేపట్టనున్న ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంతో పెట్టుబడిదారులకు భారీ అవకాశాలు రానున్నట్లు తెలిపారు కేంద్ర రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ. ఈ రహదారి వెంట రానున్న టౌన్షిప్లు, స్మార్ట్ విలేజీలు, రహదారి పక్కన నిర్మాణాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని క్రీడాకారులను ఆహ్వానించారు. ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు, పట్టణ ప్రణాళిక అసోసియేషన్తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయా అంశాలను పేర్కొన్నారు గడ్కరీ.
దిల్లీ నుంచి ముంబయికి వెళ్లేందుకు 12 గంటల మేర ప్రయాణ సమయం తగ్గించనున్న ఈ రహదారి వెంట.. లెదర్, ప్లాస్టిక్, రసాయనాల పరిశ్రమలు సహా ఇతర సంస్థల ఏర్పాటుకు వ్యాపారవర్గాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు మంత్రి.
"ఈ నూతన రహదారి హరియాణా, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్లో తీవ్రంగా వెనకబడిన ప్రాంతాల గుండా సాగుతుంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాలపై ఒత్తిడి తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈ రహదారి వ్యాపార వర్గాలకు అనేక పెట్టుబడి అవకాశాలు కల్పిస్తుంది."
-నితిన్ గడ్కరీ
స్మార్ట్ సిటీలపై పెట్టుబడుల దిశగా..
చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఊతమిచ్చే దిశగా స్మార్ట్ సిటీలు, స్మార్ట్ విలేజీల్లో, రహదారి పక్కన ఏర్పాటయ్యే రెండువేల వ్యాపారాలు, లాజిస్టిక్ పార్కుల్లో పెట్టుబడులకు వ్యాపారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు గడ్కరీ.
గృహ నిర్మాణాల కోసం..
ఈ ఎక్స్ప్రెస్ రహదారి వెంట తక్కువ ధరతో గృహ నిర్మాణ ప్రాజెక్టులు నెలకొల్పాలని, ఈ ప్రక్రియను వ్యర్థాలను ఉపయోగించి చేపట్టాలని చెప్పారు. అయితే నాణ్యతలో రాజీ పడకూడదని ఉద్ఘాటించారు.
ఇదీ చూడండి: హనీమూన్కు వెళ్లాల్సిన నవజంటకు క్వారంటైన్!