ETV Bharat / business

తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం- పారిశ్రామికోత్పత్తి జోరు - పారిశ్రామికోత్పత్తిపై ఎన్​ఎస్​ఓ డేటా

పారిశ్రామిక రంగం కరోనా సంక్షోభం నుంచి వేగంగా కోలుకుంటున్నట్లు సంకేతాలొస్తున్నాయి. సెప్టెంబర్​లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.35 శాతానికి తగ్గినట్లు జాతీయ గణాంక కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఆగస్టులో పారిశ్రామికోత్పత్తి 11.9 శాతం పుంజుకున్నట్లు ప్రకటించింది.

CPI down in September
తగ్గిన చిల్లర ద్రవ్యోల్బణం
author img

By

Published : Oct 12, 2021, 7:36 PM IST

సెప్టెంబర్​లో రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) కాస్త దిగొచ్చింది. గత నెల సీపీఐ 4.35 శాతంగా నమోదైనట్లు కేంద్ర గణాంక కార్యాలయం (ఎన్​ఎస్​ఓ) మంగళవారం వెల్లడించింది. ఆహార పదార్థాల ధరలు తగ్గటం ఇందుకు కారణంగా తెలిపింది ఎన్​ఎస్​ఓ.

అంతకు ముందు నెల (ఆగస్టులో) రిటైల్ ద్రవ్యోల్బణం 5.30 శాతంగా ఉండగా.. గత ఏడాది సెప్టెంబర్​లో ఏకంగా 7.27 శాతంగా నమోదైనట్లు ఎన్​ఎస్​ఓ డేటాలో తేలింది.

ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం సెప్టెంబర్​లో 0.68 శాతానికి దిగొచ్చింది. ఆగస్టులో ఇది 3.11 శాతంగా ఉంది.

పారిశ్రామికోత్పత్తి వృద్ధి..

ఆగస్టులో పారిశ్రామికోత్పత్తి 11.9 శాతంపెరిగింది. తయారీ, గనులు, విద్యుత్ రంగాల ప్రదర్శన కరోనా ముందు స్థాయికన్నా ఇంకా సానుకూలంగా ఉండటం ఇందుకు కలిసొచ్చినట్లు ఎన్​ఎస్​ఓ పేర్కొంది. 2020 ఆగస్టులో ఐఐపీ 7.1 శాతం క్షీణతను నమోదు చేసినట్లు వివరించింది.

ఆగస్టులో తయారీ రంగం 9.7 శాతం పుంజుకుంది. గనుల విభాగం ఏకంగా 23.6 శాతం వృద్ధి చెందింది. విద్యుత్​ ఉత్పాదన రంగం 16 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్​-ఆగస్టు మధ్య ఐఐపీ 28.6 శాతం పెరిగింది. 2020-21 ఇదే సమయంలో ఐఐపీ 25 శాతం క్షీణతను నమోదు చేసింది. కరోనా తొలి దశలో విధించిన లాక్​డౌన్​లో.. వాణిజ్య కార్యకలాపాలు స్తంభించడం ఈ స్థాయిలో క్షీణతకు కారణం.

ఇదీ చదవండి: జోరుగా వ్యాక్సినేషన్.. మరి వృద్ధి రేటు సంగతేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.