ETV Bharat / business

వడ్డీరేట్లు యథాతథం- ఆర్​బీఐ కీలక నిర్ణయాలు ఇవే.. - ఆర్​బీఐ రివర్స్​ రెపో రేటు అంటే

రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా కొనసాగించాలని ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయించింది. మూడు రోజుల సమీక్ష అనంతరం ఎంపీసీ తీసుకున్న నిర్ణయాలను ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్ తాజాగా​ వెల్లడించారు. దాస్​ ప్రకటనలోని వివరాలు ఇలా ఉన్నాయి.

RBI Governor Shaktikanta das
ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​
author img

By

Published : Oct 8, 2021, 11:50 AM IST

Updated : Oct 8, 2021, 2:40 PM IST

వరుసగా ఎనిమిదో ద్వైమాసిక సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయలేదు ఆర్​బీఐ. రెపో రేటును 4 శాతం, రివర్స్ రెపో రేటును 3.35 శాతం వద్ద యథాతథంగా కొనసాగించేందుకే ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మొగ్గు చూపినట్లు ఆర్​బీఐ గరర్నర్​ శక్తికాంత దాస్​ శుక్రవారం వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న సంకేతాలు ఉన్నప్పటికీ ఆర్​బీఐ సర్దుబాటు వైఖరిని కొనసాగించడం గమనార్హం. రెపో, రివర్స్ రెపో రేట్లను చివరి సారిగా .. 2020 మేలో సవరించింది ఆర్​బీఐ. కరోనా నేపథ్యంలో ఇంతటి అత్యల్ప స్థాయికి వడ్డీ రేట్లను తగ్గించింది. అయితే కరోనా నుంచి ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకునేందుకు ఊతమందించే దిశగా.. అప్పటి నుంచి కీలక వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతూ వస్తోంది.

గవర్నర్​ శక్తికాంత దాస్​ అధ్యక్షతన.. ఎంపీసీ సమీక్ష బుధవారం (అక్టోబర్​ 6న) ప్రారంభమైంది. మూడు రోజుల సమీక్షలో వడ్డీ రేట్లు సహా ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను శక్తికాంతాదాస్​ తాజాగా వెల్లడించారు.

దాస్​ ప్రకటనలోని ముఖ్యాంశాలు..

  • భారీ ఎన్​బీఎఫ్​సీ (నాన్​ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ) కస్టమర్ల సమస్యల పరిష్కారానికి అంతర్గత అంబూడ్స్​మన్ పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆర్​బీఐ నిర్ణయం తీసుకుంది.
  • ఐఎంపీఎస్​ విధానం ద్వారా నగదు బదిలీ పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధిరేటు 9.5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటును 17.1 శాతంగా నిర్దేశించుకుంది.
  • పెట్టుబడుల్లో కూడా స్పష్టమైన పునరుద్ధరణ సంకేతాలు కనిపిస్తున్నాయి. గిరాకీ పుంజుకుంటోంది. పండుగ సీజన్‌లో పట్టణ ప్రాంతాల్లో గిరాకీ మరింత వేగంగా ఊపందుకుంటుందని భావిస్తున్నామని దాస్ వెల్లడించారు.
  • ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. కీలక ద్రవ్యోల్బణం లక్షిత పరిధిలోనే ఉందన్నారు దాస్​. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగానే ఉందని పేర్కొన్నారు.
  • చివరి ద్రైమాసిక పరపతి విధాన సమీక్ష నాటితో పోలిస్తే ఆర్థికంగా భారత్‌ ప్రస్తుతం మెరుగైన స్థాయిలో ఉందని ఆర్​బీఐ గవర్నర్​ పేర్కొన్నారు.
  • క్యాపిటల్‌ గూడ్స్‌కి గిరాకీ పుంజుకోవడం ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణను సూచిస్తోంది.
  • ఈ ఆర్థిక సంవత్సర రిటైల్‌ ద్రవ్యోల్బణ (సీపీఐ) లక్ష్యాన్ని 5.7 శాతం నుంచి 5.3 శాతానికి ఆర్‌బీఐ సవరించింది. జులై-సెప్టెంబరులో సీపీఐ అంచనాల కంటే తక్కువగా నమోదు కావడం గమనార్హం. అక్టోబరు-డిసెంబరు త్రైమాసిక లక్ష్యాన్ని కూడా 5.3 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గించింది ఆర్​బీఐ.

ఇదీ చదవండి: సామాన్యుడికి చుక్కలు- మళ్లీ పెరిగిన పెట్రోల్​ ధరలు

Last Updated : Oct 8, 2021, 2:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.