ETV Bharat / business

'2021-22 క్యూ1లో వృద్ధి రేటు 18.5 శాతం'.. కానీ...

2021-22 ఏప్రిల్​-జూన్​ త్రైమాసికంలో (GDP in FY22 Q1) వృద్ధి రేటు 18.5 శాతంగా ఉండొచ్చని ఎస్​బీఐ ఎకోరాప్​ నివేదిక అంచనా వేసింది. అయితే ఆర్​బీఐ (RBI on Growth rate) అంచనా (21.4 శాతం)తో పోలిస్తే ఎస్​బీఐ అంచనా తక్కువగా ఉండటం గమనార్హం. ఎస్​బీఐ నివేదిక ద్వారా తెలిసిన మరిన్ని విషయాలు ఇలా ఉన్నాయి.

Growth rate Expectations
భారత వృద్ధి రేటు అంచనాలు
author img

By

Published : Aug 24, 2021, 1:11 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ (GDP in FY22 Q1) జీడీపీ వృద్ధి రేటు 18.5 శాతంగా నమోదవ్వచ్చని ఎస్​బీఐ ఎకోరాప్​ నివేదిక అంచనా వేసింది. 'న్యూ కాస్టింగ్​ మోడల్'​ ఆధారంగా ఈమేరకు లెక్కగట్టింది. దేశీయ పారిశ్రామిక, సేవా రంగ కార్యకలపాలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవహరాలు సహా మొత్తం 41 రకాల ఇండికేటర్స్​ను కలిపి 'న్యూకాస్టింగ్​ మోడల్​ (Nowcasting Model)'ను అభివృద్ధి చేసింది ఎస్​బీఐ.

అయితే వృద్ధి రేటుపై ఆర్​బీఐ (RBI on growth rate) అంచనాల కన్నా.. ఎస్​బీఐ ఎకోరాప్​ అంచనాలు తక్కువగా ఉండటం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్​-జూన్ మధ్య దేశ వృద్ధి రేటు 21.4 శాతంగా నమోదవ్వచ్చని ఆర్​బీఐ పేర్కొంది. ఈ స్థాయిలో సానుకూల అంచనాలను విడుదల చేసేందుకు.. గత ఏడాది ప్రతికూలంగా నమోదైన వృద్ధి రేటే కారణమని స్పష్టం చేసింది.

జీవీఏ 15 శాతం..

2021-22లో వస్తు సేవల నికర విలువ (జీవీఏ​) 15 శాతం వద్ద ఉండొచ్చని ఎస్​బీఐ ఎకోరాప్ నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో 4,069 కార్పొరేట్ల జీవీఏ 28.4 శాతంగా నమోదైనట్లు వివరించింది.

వ్యాపార కార్యకలాపాలు సానుకూలం..

దేశీయంగా వ్యాపార కార్యకలాపాలు పుంజుకుంటున్నట్లు హై ఫ్రీక్వెన్సీ ఇండెక్స్​లు​ సూచిస్తున్నాయని ఎస్​బీఐ నివేదిక వెల్లడించింది. ఆగస్టులో కూడా ఈ సానుకూలతలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆగస్టు 16తో ముగిసిన వారానికి వ్యాపార కార్యకలాపాల స్కోరు 103.3గా నమోదైనట్లు తెలిపింది.

ఆర్​టీఓ వసూళ్లు, విద్యుత్​ వినియోగం వంటివి 2021-22 రెండో త్రైమాసికంలో పూర్తిగా తేరుకుంటాయని ఎస్​బీఐ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇది ఆర్థిక వ్యవస్థలో సానుకూల ప్రభావాన్ని చూపుతుందని వివరించింది.

ఇదీ చదవండి: Corona Vaccine: ఇక వాట్సాప్‌లోనూ టీకా 'స్లాట్‌ బుకింగ్‌'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.