ETV Bharat / business

'జీఎస్టీపై వడ్డీ కోతతో చిరు వ్యాపారికి ఊతం' - business news

చిన్నవ్యాపారులకు ఉపశమనం కల్పించే దిశగా జీఎస్టీ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు చెల్లించాల్సిన పన్నుమొత్తంపై వడ్డీని 18 నుంచి 9 శాతానికి తగ్గించింది. 2017 జులై-2020 జనవరి మధ్య జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయని వారి నుంచి ఆలస్య రుసుముగా రూ. 500వరకు వసూలు చేయాలని నిర్ణయించింది.

gst
'చిన్నవ్యాపారి మేలు కోసమే జీఎస్టీపై వడ్డీలో కోత'
author img

By

Published : Jun 12, 2020, 5:09 PM IST

కరోనా లాక్​డౌన్ కారణంగా దెబ్బతిన్న చిరు వ్యాపారులకు ఉపశమనం కల్పించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది జీఎస్టీ మండలి. రూ. 5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న విక్రయదారులు ఆలస్యంగా చెల్లించే పన్నుమొత్తాలపై వడ్డీని 18 శాతం నుంచి 9 శాతానికి తగ్గించింది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల పన్ను చెల్లింపులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టంచేసింది.

మే, జూన్ మాసాల జీఎస్టీ రిటర్నుల దాఖలుకు సెప్టెంబర్ వరకు గడువు పొడిగిస్తున్నట్లు జీఎస్టీ మండలి సమావేశం తర్వాత వెల్లడించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

వారికి ఆలస్య రుసుములు లేవు..

జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం మేరకు 2017 జులై నుంచి 2020 జనవరి మధ్య ఎలాంటి బకాయిలు లేకుండా జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసినవారిపై ఆలస్య రుసుము విధించరు. పన్ను బకాయిలు ఉన్నవారు, 2017 జులై-2020 జనవరి మధ్య జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయని వారి నుంచి గరిష్ఠ ఆలస్య రుసుముగా రూ. 500 వసూలు చేయనున్నారు. ఈ మొత్తం 2020 జులై 1 నుంచి 2020 సెప్టెంబర్ 30 మధ్య రిటర్నులు దాఖలు చేసే వారి నుంచి వసూలు చేస్తారు.

పాన్ మసాలాపై వచ్చే భేటీలోనే..

పాన్​ మసాలాపై జీఎస్టీకి సింబంధించి వచ్చే సాధారణ మండలి సమావేశంలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు ఆర్థికమంత్రి. పాదరక్షలు, ఎరువులపై జీఎస్టీ తగ్గింపునకు యోచిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రాలకు పరిహారంపై..

మంత్రులు, వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతుల మేరకు కరోనా నేపథ్యంలో రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారం మొత్తంపై జులైలో ప్రత్యేకంగా సమావేశమవుతామని చెప్పారు నిర్మల. కేంద్ర, రాష్ట్రాలకు కలిపి ఐజీఎస్టీ ప్రవేశపెట్టడానికి ముందు.. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను మొత్తాన్ని పంచుకోవాలనే ప్రతిపాదన వచ్చిందని వెల్లడించారు. దీనికి తాత్కాలిక పరిష్కారాన్నే నాడు చేపట్టామని.. ఈ అంశాన్ని త్వరలోనే పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని తెలిపారు. రాష్ట్రాల అవసరాలు గుర్తించే.. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలకు బకాయిపడిన పన్ను మొత్తాలను ఎలాంటి తగ్గింపులు లేకుండానే అందించామన్నారు నిర్మల.

ఇదీ చూడండి: జియో బంపర్​ ఆఫర్- ఇక 'ప్రైమ్'​ ఉచితం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.