విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణకు భారత్ ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుతామని. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. విదేశీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పలు రంగాలలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలలో సవరణలను పరిశీలిస్తామని తెలిపింది. మీడియా, విమానయానం, బీమా, సింగిల్ బ్రాండ్ రంగాలలోకి మరిన్ని ఎఫ్‌డీఐలను అనుమతించమని వచ్చిన సలహాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీఐలు ఆరుశాతం పెరిగి 64.37 బిలియన్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలో స్థానిక నింబంధనలు సరిళీకృతం చేస్తామని వెల్లడించారు. భారత్‌లో ప్రతి ఏడాది అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించారు.
ఇన్సూరెన్స్ ఇంటర్మీడియరీస్‌లోకి... వందశాతం ఎఫ్‌డీఐ లను అనుమతించనున్నట్లు విత్త మంత్రి బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.స్టాక్‌మార్కెట్లలో ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులకు మరింత వెసులుబాటు కల్పిస్తామన్నారు. ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులకు విదేశీ పోర్టుఫోలియోగా గుర్తింపునిస్తామని తెలిపారు