ETV Bharat / business

కరోనా వేళ... కేంద్రం కోత

కేంద్ర పన్నుల్లో వాటా నిధులుగా రాష్ట్రాలకు ఇచ్చే మొత్తంలో భారీగా కోత పడింది. అన్ని రాష్ట్రాలకు కలిపి సోమవారం కేంద్రం రూ.46,038.70 కోట్లు విడుదల చేయగా అందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,892.64 కోట్లు జమయ్యాయి. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ నిధులను బదలాయిస్తూ ఉంటుంది.

కరోనా వేళ... కేంద్రం కోత
కరోనా వేళ... కేంద్రం కోత
author img

By

Published : Apr 21, 2020, 6:36 AM IST

2020-21 కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి కేంద్రం రూ.32,237.68 కోట్లు రాష్ట్రానికి ఇచ్చేందుకు ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రతి నెలా ఆ వాటా సొమ్ములను విడుదల చేస్తుంది. సాధారణంగా 20వ తేదీన ఆ నిధులు రాష్ట్రాలకు విడుదలవుతుంటాయి. ఆ లెక్క ప్రకారం రాష్ట్రానికి రూ.2,686.47 కోట్ల వరకు రావాల్సి ఉందని ఆర్థికశాఖ వర్గాలు చెబుతుండగా..రూ.1,892.64 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. దాదాపు 29.55శాతం నిధుల విడుదలలో కోత పడిందని పేర్కొంటున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రం సొంత ఆదాయాలను భారీగా కోల్పోయింది. నెలవారీ వ్యయాలను అందుకోవడం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో.. కేంద్ర పన్నుల వాటాల్లోనూ కోత పడటంతో ఆర్థిక పరిస్థితి మరింత ఇబ్బందుల్లోకి వెళ్లనుంది.

ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు రాష్ట్రానికి కొంత మేర నిధుల్లో కోత పెట్టాయి. వారు నిర్దేశించుకున్న ప్రమాణాల వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ప్రభుత్వం తొలి నుంచి చెబుతూనే వస్తోంది. అయినా..ఆ ప్రమాణాల్లో ఆర్థిక సంఘం మార్పులు చేయలేదు. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి 4.305శాతం వాటా నిధులు ఇవ్వాలని పేర్కొనగా..15వ ఆర్థిక సంఘం దాన్ని 4.111శాతానికి తగ్గించింది. దీని వల్ల 0.194శాతం..అంటే ఏడాదికి రూ.1,521.31 కోట్లు నష్టపోయినట్లయింది. ఇప్పుడు ఆర్థిక సంఘం సూచించిన మేరకు ఇచ్చే నిధుల్లోనూ 30శాతం వరకు కోత పెట్టడం గమనార్హం. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ మేరకు కోత పడిందని చెబుతున్నారు.

ఇదీ చదవండి: ఈ నెల 23న 15 ఆర్థిక సంఘం సలహా మండలి భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.