ETV Bharat / business

యూజర్లకు వొడాఫోన్​​ ఐడియా హెచ్చరిక!

మీరు వొడాఫోన్​ ఐడియా నెట్​వర్క్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త! కంపెనీ పేరుతో సైబర్​ మోసాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఆ సంస్థే స్వయంగా వెల్లడించింది. మోసాలు ఎలా జరుగుతున్నాయి? వాటి నుంచి జాగ్రత్తగా ఉండాలి? అనే వివరాలు మీకోసం.

Vodafone Idea
వొడాఫోన్ ఐడియా
author img

By

Published : Aug 5, 2021, 1:14 PM IST

Updated : Aug 5, 2021, 2:24 PM IST

దేశీయ టెలికాం సంస్థ వొడాఫోన్​ ఐడియా(వి) తమ యూజర్లను అప్రమత్తం చేసింది. కంపెనీ పేరును అక్రమంగా వాడుకుని మోసాలు జరుగుతున్నాయని.. వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

మోసాలు ఎలా జరుగుతున్నాయంటే..

మీ కేవైసీ అప్​డేట్​ చేయాలి అంటూ.. 'వి' యూజర్లకు మెసేజ్​లు, కాల్స్ వస్తున్నాయి. వెంటనే కేవైసీ అప్​డేట్​ చేయకుంటే సేవలు నిలిచిపోతాయని అందులో పేర్కొంటున్నారు సైబర్​ నేరగాళ్లు.

అలాంటి లింక్​లు నిజమేనని నమ్మి వాటిని క్లిక్​ చేస్తే.. వ్యక్తిగత డేటా, ఫోన్​లో ఉన్న విలువైన సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని తెలిపింది 'వి'. ఇది ఆర్థిక నష్టాలకు దారితీయొచ్చని పేర్కొంది.

ఈ నేపథ్యంలో కేవైసీ అప్​డేట్​ చేసుకోమని, వ్యక్తిగత సమాచారం కోరుతూ కంపెనీ ఎలాంటి కాల్స్, మెసేజ్​లు పంపదని స్పష్టం చేసింది వొడాఫోన్​ ఐడియా. అలా ఏవైనా సందేశాలు, కాల్స్​ వచ్చినా వాటికి స్పందించొద్దని సూచించింది.

ఇదీ చదవండి: పాత నోట్లు, నాణేలు​ పేరుతో మోసాలు- ఆర్​బీఐ వార్నింగ్

Last Updated : Aug 5, 2021, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.