ETV Bharat / business

ఏఐజీ హాస్పిటల్స్​ సీపీఆర్​ఓకు 'చాణక్య' అవార్డు - Chanakya award

ఏఐజీ హాస్పిటల్స్​ (AIG Hospitals hyderabad) ప్రజాసంబంధాల ముఖ్య అధికారి యూ సత్యనారాయణ ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్నారు. భారత ప్రజా సంబంధాల మండలి(PRCI awards) అందించే చాణక్య అవార్డును.. కైవసం చేసుకున్నారు. ప్రజా భద్రతా కమ్యూనికేషన్స్ రంగంలో గత 20 ఏళ్లుగా ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు (PRCI awards 2021) అందిస్తున్నట్లు పీఆర్​సీఐ తెలిపింది.

prci excellence awards 2020
పీసీఆర్ఐ అవార్డులు
author img

By

Published : Sep 18, 2021, 3:35 PM IST

Updated : Sep 18, 2021, 4:13 PM IST

ప్రముఖ ఏఐజీ హాస్పిటల్స్​ (AIG Hospitals hyderabad) చీఫ్ పీఆర్ఓ యూ సత్యనారాయణ.. భారత ప్రజా సంబంధాల మండలి(PRCI awards 2021) అందించే ప్రతిష్ఠాత్మక చాణక్య అవార్డు (Chanakya award 2021) దక్కించుకున్నారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ అవార్డును (PRCI awards) ప్రదానం చేశారు. ఏదైనా రంగంలో ప్రతిభ కనబర్చిన కమ్యూనికేషన్ ప్రొఫెషనల్స్​కు ఈ జాతీయ అవార్డు (PRCI awards) ఇస్తారు.

Chanakya award 2021
అవార్డు అందుకుంటున్న సత్యనారాయణ

ఆవిష్కరణలు, రోగుల సంక్షేమంలో హైదరాబాద్​లోని ఏఐజీ హాస్పిటల్స్​ (AIG Hospitals hyderabad) ముందంజలో ఉన్నాయని, ఈ విషయాన్ని ప్రజలకు చేరువయ్యేలా ప్రజా సంబంధాల ముఖ్య అధికారి సత్యనారాయణ కీలకంగా పనిచేశారని పీఆర్​సీఐ పేర్కొంది. ప్రజా భద్రతా కమ్యూనికేషన్స్ రంగంలో ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు(PRCI awards) అందిస్తున్నట్లు తెలిపింది.

'అవార్డులు జోష్ ఇస్తాయి'

ప్రస్తుతం సోమాజీగూడలోని ఏషియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటెరాలజీలో ఆపరేషన్స్ (Asian Institute of Gastroenterology) హెడ్​గా సత్యనారాయణ పనిచేస్తున్నారు. గత 20 ఏళ్ల నుంచి ఈ సంస్థకు ప్రజా సంబంధాల ముఖ్య అధికారిగా సేవలు అందిస్తున్నారు. అవార్డు (PRCI awards) అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆయన.. ఆస్పత్రి ఛైర్మన్ డీ. నాగేశ్వర్ రెడ్డి తనను ఎల్లప్పుడూ ప్రోత్సహించేవారని చెప్పారు. ఇటువంటి అవార్డులు భవిష్యత్​లో మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు ఉపయోగపడతాయని అన్నారు.

ఇదీ చదవండి: పెళ్లికి యువత 'నో'.. ఆ విషయానికి మాత్రం సై!

Last Updated : Sep 18, 2021, 4:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.