ETV Bharat / business

మరో 6 కంపెనీల ఐపీఓలకు సెబీ గ్రీన్ సిగ్నల్​

దేశంలో ఐపీఓకి వస్తున్న కంపెనీలు పెరుగుతున్నాయి. తాజాగా మరో 6 కంపెనీల ఐపీఓ దరఖాస్తుకు సెబీ ఆమోద ముద్ర వేసింది. ఆ కంపెనీలు ఏవి? అవి సమీకరించనున్న నిధుల మొత్తం ఎంత? అనే వివరాలు ఇలా ఉన్నాయి.

Six companies get SEBI nod to IPO
ఆరు ఐపీఓలకు ఆమోదం
author img

By

Published : Jul 27, 2021, 11:26 AM IST

యాప్టస్​ వ్యాల్యూ హౌసింగ్ ఫినాన్స్, కార్​ట్రేడ్​, సుప్రియా లైఫ్​సైన్స్​, కృష్ణ డయాగ్నోస్టిక్స్​, విజయా డయాగ్నోస్టిక్స్​, యామీ ఆర్గానిక్స్​ కంపెనీల పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదనలకు సెబీ ఆమోద ముద్ర వేసింది.

కార్​ట్రేడ్​

పూర్తిగా ఆఫర్​ ఫర్ సేల్​ ద్వారానే షేర్లు విక్రయించనుంది. కార్​ట్రేడ్​లో ప్రస్తుతం 11.93 శాతం వాటా ఉన్న సీబీడీబీ-2.. 16.07 లక్షల షేర్లను, 34.44 శాతం వాటా ఉన్న హైడెల్​ ఇన్వెస్ట్​మెంట్​ 53.79 లక్షల షేర్లను, 26.48 శాతం వాటా ఉన్న మ్యాక్​రిచే ఇన్వెస్ట్​మెంట్ 35.68 లక్షల షేర్లను, 7.04 శాతం వాటా ఉన్న స్ర్పింగ్​ఫీల్డ్​ వెంచర్​ ఇంటర్నేషనల్​ 11.24 లక్షల షేర్లను విక్రయించనున్నాయి.

యాప్టస్ వ్యాల్యూ హౌసింగ్ ఫినాన్స్

రు.500 కోట్ల విలువైన కొత్త షేర్లతో పాటు.. ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదార్లకు చెందిన 6,45,90,695 షేర్లను ఆఫర్​ ఫర్​ సేల్​లో జారీ చేయనుంది. ఈ ఐపీఓ ద్వారా లభించే రూ.2,600- రూ.3,000 కోట్లను భవిష్యత్​ వృద్ధి అవసరాల కోసం, మూలధనాన్ని పెంచుకునేందుకు ఉపయోగించుకోనుంది.

సుప్రియా లైఫ్​సైన్స్​

రూ.200 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు ప్రమోటర్​ సతీశ్​ వామన్​ వాఘ్​ రూ.1000 కోట్ల విలువైన షేర్లను ఆఫర్​ ఫర్​ సేల్​లో విక్రయించనున్నారు. సమీకరించే నిధులను మూలధన వ్యయాలు, రుణాల చెల్లింపునకు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించుకోనుంది కంపెనీ.

కృష్ణ డయాగ్నోస్టిక్స్​

రు.400 కోట్ల విలువైన కొత్త షేర్లను ఆఫర్​ ఫర్​ సేల్​లో ప్రస్తుత వాటాదార్లకు చెందిన 94,16,377 షేర్లను కంపెనీ విక్రయించనుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సమకూరే నిధులను పంజాబ్​, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్​, మహారాష్ట్రల్లో డయాగ్నోస్టిక్స్ సెంటర్​ల ఏర్పాటు, రుణాల చెల్లింపునకు వినియోగిస్తుంది.

విజయా డయాగ్నోస్టిక్స్​

పూర్తిగా ఆఫర్​ ఫర్​ సేల్​ ద్వారానే షేర్ల విక్రయిస్తున్నారు. ప్రమోటర్​ ఎస్​.సురేందర్ రెడ్డి, ప్రస్తుత వాటాదారైన కారాకోరమ్​ లిమిటెడ్, కేదారా కేపిటల్​ ఆల్టర్నేటివ్​ ఇన్వెస్ట్​మెంట్​ ఫండ్​లు కలిసి 3,56,88,064 షేర్లను విక్రయించనున్నారు. కంపెనీలో వీళ్లు విక్రయించే షేర్ల వాటా 35 శాతం వరకు ఉంటుంది.

యామీ ఆర్గానిక్స్​

రు.300 కోట్ల విలువైన కొత్త షేర్లను, ఆఫర్​ ఫర్​ సేల్​లో ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదార్లకు చెందిన 60,59,600 షేర్లను కంపెనీ విక్రయించనుంది. సమీకరించే నిధుల్లో రూ.140 కోట్లను రుణాల తిరిగి చెల్లింపునకు, నిర్వహణ మూలధన అవసరాలకోసం రూ.90 కోట్లను కంపెనీ వినియోగించుకోనుంది.

ఇదీ చదవండి: 'గ్రేట్​ లెర్నింగ్' ఇక బైజూస్​ సొంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.