అప్పుల ఊబిలో చిక్కుకున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కొనుగోలుకు బిడ్లు దాఖలు చేసేందుకు మరింత గడువు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత గడువు శుక్రవారం (అక్టోబర్ 30)తో ముగియనుంది. అయితే డిసెంబర్ 14 వరకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఎయిర్ ఇండియా అప్పుల విషయంలో కొనుగోలుదారుకు మరింత ఊరటనిచ్చే యోచనలో భాగంగా గడువు పెంపు ఉండనున్నట్లు వివరించాయి.
గడువు పెంపుపై ఎయిర్ ఇండియా స్పెసిఫిక్ ఆల్టర్నేటివ్ మెకానిజం (ఏఐఎస్ఏఎం) స్పష్టతనిచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బిడ్ల దాఖలుకు ఆసక్తిగా ఉన్న సంస్థలు ప్రీలిమ్నరీ ఇన్ఫర్మేషన్ మెమోరాండమ్ (పీఐఎం)లో మార్పులపై సందేహాలను అడిగేందుకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి.
ఇదీ చూడండి:టీకా ట్రయల్స్‌కు డాక్టర్ రెడ్డీస్ కసరత్తు ముమ్మరం