ETV Bharat / business

'ప్రైవేటీకరణ తర్వాత ఎయిర్​ ఇండియాకు పూర్వ వైభవం' - స్పైస్​ జెట్​ యజమాని

ప్రైవేటీకరణ తర్వాత ఎయిర్​ ఇండియాకు(air india disinvestment news latest) పూర్వ వైభవం వస్తుందన్నారు ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్​ జెట్ సీఎండీ అజయ్​ సింగ్​(spice jet owner). ఆరోగ్యకరమైన ఏఐతో దేశం మొత్తానికి మేలు జరుగుతుందన్నారు. బిడ్​ దాఖలు(Air India bidders list) చేసిన క్రమంలో దానిపై ఎలాంటి విషయాలు వెల్లడించలేనని చెప్పారు.

SpiceJet CMD
ఎయిర్​ ఇండియా, స్పైస్​ జెట్​
author img

By

Published : Oct 7, 2021, 10:25 AM IST

ఎయిర్​ ఇండియాతో(air india disinvestment news latest) దేశానికి మేలు చేకూరుతుందన్నారు బడ్జెట్​ విమానయాన సంస్థ స్పైస్​ జెట్​ సీఎండీ అజయ్​ సింగ్​(spice jet owner). ప్రభుత్వం ప్రైవేటీకరణ(Air India privatisation) పూర్తి చేసిన తర్వాత 'మహరాజా' బ్రాండ్​ విలువ క్రమంగా పుంజుకుని పూర్వ వైభవాన్ని అందుకుంటుందన్నారు. ఎయిర్​ ఇండియా కోసం వ్యక్తిగత హోదాలో బిడ్​ దాఖలు చేశారా? అన్న ప్రశ్నకు తనదైన శైలీలో సమాధానమిచ్చారు సింగ్​. ' బిడ్​ దాఖలు(Air India bidders list) విషయం మీకు తెలుసు కదా. ప్రభుత్వంతో ఒప్పందంపై మేము పూర్తి నమ్మకంతో ఉన్నాము. కాబట్టి, ఎయిర్​ ఇండియా బిడ్ల గురించి మాట్లాడలేను.' అని తెలిపారు.

అంతర్జాతీయ ఎయిర్​ ట్రాన్స్​పోర్ట్​ అసోసియేషన్​ 77వ వార్షిక సదస్సుకు హాజరైన క్రమంలో ఎయిర్​ ఇండియాపై మాట్లాడారు సింగ్(spice jet owner)​.

"ఎయిర్​ ఇండియా ప్రైవేటీకరణ ఎలా ఉంటుందనేది అంతా ఊహాజనితం. అయితే.. ఆరోగ్యకరమైన ఏఐ యావత్​ దేశానికి మేలు చేస్తుంది. మహారాజను మేము తీసుకున్నా, మరొకరి చేతికి వెళ్లినా.. అది ఆరోగ్యకరమైన ఎయిర్​లైన్​గా నిలుస్తుంది. ఎయిర్​ ఇండియా బ్రాండ్​ క్రమంగా పుంజుకుని గొప్ప స్థాయికి చేరుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపున్న ఆ సంస్థ.. భారత్​కు చాలా అవసరం. "

- అజయ్​ సింగ్​, స్పైస్​ జెట్​ సీఎండీ.

ప్రభుత్వ రంగ సంస్థ ఏయిర్​ ఇండియాలో 100 శాతం వాటాను(Air India privatisation) విక్రయించాలని భావిస్తోంది కేంద్రం. అందుకోసం బిడ్లు ఆహ్వానించింది. 2020లోనే ఈ ప్రక్రియ ప్రారంభించినప్పటికీ కొవిడ్​-19 కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. సెప్టెంబర్​ 30కి తుది గడువు విధించిన క్రమంలో స్పైస్​ జెట్​, టాటా గ్రూప్​లు బిడ్లు దాఖలు చేశాయి. అక్టోబర్​ 1న టాటా గ్రూప్​ బిడ్​కు కేంద్రం ఆమోదం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం(డీఐపీఏఎం) సెక్రెటరీ తుహిన్​ కాంత్​ పాండే ట్వీట్టర్​ వేదికగా తెలిపారు.

ఇదీ చూడండి: Air India news: 'ఎయిర్​ ఇండియా' వార్తలను ఖండించిన ప్రభుత్వం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.