ETV Bharat / business

మైక్రోసాఫ్ట్​ బోర్డ్​ ఆఫ్​ డైరెక్టర్స్​ నుంచి తప్పుకున్న బిల్​గేట్స్ - Microsoft CEO

సాఫ్ట్​వేర్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్​ బోర్డ్​ ఆఫ్​ డైరెక్టర్స్​ నుంచి తప్పుకున్నారు ఆ సంస్థ సహ వ్యవహస్థాపకులు బిల్​గేట్స్​. సామాజిక సేవకు ఎక్కువ సమయం కేటాయించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Bill Gates steps down from Microsoft's board of directors
మైక్రోసాఫ్ట్​ బోర్డు ఆఫ్​ డైరెక్టర్స్​ నుంచి తప్పుకున్న బిల్​గేట్స్
author img

By

Published : Mar 14, 2020, 5:01 AM IST

Updated : Mar 14, 2020, 7:07 AM IST

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బోర్డ్​ ఆఫ్‌ డైరెక్టర్స్​ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఎక్కువ సమయం సామాజిక సేవకు వినియోగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే మైక్రోసాఫ్ట్​ ముఖ్య కార్యనిర్వాహణాధికారి(సీఈఓ) సత్యనాదెళ్లతో పాటు కంపెనీలోని ఇతర సభ్యులకు సాంకేతిక సలహాదారుగా కొనసాగుతానని వెల్లడించారు.

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో రెండోస్థానంలో ఉన్న బిల్​గేట్స్​.. బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా పలు దేశాల్లో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్య, ఆర్థిక, ఉపాధి కల్పన రంగాల్లో ఈ ఫౌండేషన్‌ ఆర్థిక, సహాయ సహకారాలు అందిస్తోంది.

Last Updated : Mar 14, 2020, 7:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.