ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ (జీవిత బీమా కార్పొరేషన్).. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) నిర్వహణ (LIC IPO) వ్యవహారాల కోసం దేశీయ, అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాలు (bankers in race for managing LIC IPO) పెద్ద ఎత్తున పోటీ పడుతున్నాయి. ఎల్ఐసీ ఐపీఓ దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా (Largest IPO in India) నిలవనున్న నేపథ్యంలో అటు మదుపరులతో పాటు.. మార్కెట్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఐపీఓ నిర్వహణపై ఆసక్తిగా ఉన్న బ్యాంకులు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) ఎదుట ప్రజెంటేషన్ ఇవ్వనున్నాయి.
అంతర్జాతీయ సంస్థల జాబితా..
బీఎన్బీ పరిబాస్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, డీఎస్పీ మెరిల్ లించ్ లిమిటెడ్ సహా ఏడు అంతర్జాతీయ బ్యాంకులు మంగళవారం ప్రజెంటేషన్ ఇవ్వనున్నాయని దీపమ్ సర్క్యులర్ ద్వారా తెలిసింది. గోల్డ్మన్ శాక్స్ (ఇండియా) సెక్యూరిటీస్, హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్, క్యాపిటల్ మార్కెట్స్ (ఇండియా), జేపీ మోర్గాన్ ఇండియా, నోమురా ఫినాన్షియల్ అడ్వైజరీ, సెక్యూరిటీస్ (ఇండియా) ఈ జాబితాలో ఉన్న మిగతా అంతర్జాతీయ దిగ్గజాలు.
దేశీయ బ్యాంకర్లు, ఆర్థిక సంస్థలు..
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాలు బుధవారం ప్రజెంటేషన్ ఇవ్వనున్నాయి. ఇందులో యాక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్, డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ప్రధానంగా ఉన్నాయి. జేఎం ఫినాన్షియల్ లిమెటెడ్, కోటక్ మహీంద్రా క్యాపిటల్ కో లిమిటెడ్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్, ఎస్ సెక్యూరిటీస్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ఎల్ఐసీ ఐపీఓ సన్నాహకాల్లో భాగంగా.. కన్సల్టింగ్ సంస్థలు, ఇన్వెస్ట్‌మెంట్ - మర్చంట్ బ్యాంకర్లు, ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి గత నెల 15న బిడ్లను ఆహ్వానించింది ఆర్థికశాఖ. ఐపీఓ ముందు కార్యాచరణ, దీపమ్‌కు సహకరించేందుకు రెండు సలహా సంస్థలను ఎంపిక చేయనుంది.
ఇవీ చదవండి: