ETV Bharat / business

భద్రతా పరమైన సమస్యలను పరిష్కరిస్తాం: జూమ్​

ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్​ యాప్ 'జూమ్'​పై వచ్చిన ఆరోపణలకు ఆ సంస్థ స్పందించింది. తమ ప్లాట్​ఫాంలో తలెత్తిన భద్రతా పరమైన సమస్యలపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది.

Zoom rolls out new measures as security fears mount
భద్రతా పరమైన సమస్యలను పరిష్కరిస్తాం:జూమ్​
author img

By

Published : Apr 17, 2020, 1:41 PM IST

లాక్​డౌన్​ కారణంగా చాలామంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఇంటి నుంచి విధులు నిర్వహిస్తూ.. వీడియో సమావేశాలకు 'జూమ్'​ యాప్​ను వినియోగిస్తున్నారు. అయితే ఈ ప్లాట్​పాం శ్రేయస్కరం కాదని వచ్చిన ఆరోపణలపై ఆ సంస్థ స్పందించింది. డేటా హ్యాకింగ్​, వేధింపులు వంటి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోనున్నట్లు జూమ్​ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ ఎరిక్​ యువాన్​ తెలిపారు.

పటిష్ఠ భద్రత..

భద్రతా పరమైన సమస్యలను కనిపెట్టినవారికి బహుమతులిచ్చే 'బగ్​ బౌంటీ' కార్యక్రమం ద్వారా.. లూటా సెక్యూరిటీ సంస్థతో కలిసి పనిచేయనున్నట్లు స్పష్టం చేశారు యువాన్​. అపరిచితుల నుంచి వచ్చే సంభాషణలు, వీడియో సమావేశాలను లాక్​ చేసేలా ప్రత్యేకమైన సెట్టింగులను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

చైనా నుంచి డేటా హ్యాకింగ్​ జరుగుతోందని అనుమానాలు తలెత్తుతున్న క్రమంలో.. ఈ వారంతం నుంచి చెల్లింపు ఖాతాదారులు వారి సమాచారాన్ని ఏ ప్రాంతాలకు మళ్లించాలో తామే ఎంపిక చేసుకునే సదుపాయాన్ని తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

ఈ విధంగా హ్యాకింగ్​...

యాప్​ వినియోగదారుల లాగిన్​ సమాచారాన్ని నేరస్థులు దొంగలించి 'డార్క్​వెబ్'​కు విక్రయిస్తున్నట్లు సంస్థ నివేదికలో వెల్లడించింది. ఇటర్నెట్​ ద్వారా, ప్రమాదకరమైన వైరస్​ను కంప్యూటర్లలోకి ఎక్కించి ఈ నేరానికి పాల్పడే అవకాశం ఉందని జూమ్​ సలహాదారు అలెక్స్ స్టామెస్​ పేర్కొన్నారు. ఇటువంటి భద్రతా పరమైన అన్ని సమస్యలనూ పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.

మార్చిలో అమాంతం పెరిగిన యూజర్లు...

ఇటీవల జూమ్​ యాప్​ను ప్రభుత్వ అధికారులెవ్వరూ ఉపయోగించకూడదని కేంద్రం ఆదేశించింది. న్యూయార్క్​లోనూ ట్రంప్​ సర్కార్​ ఈ తరహాలోనే సూచనలు జారీ చేసింది. జూమ్​ యాప్​ను హ్యాకర్లు హైజాక్​ చేస్తున్నట్లు ఎఫ్బీఐ కూడా హెచ్చరించింది. గతేడాది ఈ యాప్​ను 10 మిలియన్ల మంది ఉపయోగిస్తుండగా.. ఈ ఏడాది మార్చి నుంచి ఏకంగా 200 మిలియన్ల మంది వినియోగిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.