ETV Bharat / business

వాట్సాప్​లో అదిరే ఫీచర్లు- గ్రూప్ కాలింగ్​కు నయా లుక్​! - వాట్సాప్​ అప్డేట్​

Whatsapp new features: మెసెంజర్ దిగ్గజం వాట్సాప్ త్వరలో సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్​ చాట్, కాలింగ్​కు కొత్త లుక్​ను ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేగాక గ్రూప్ అడ్మిన్​లకు మరిన్ని అధికారాలు ఇవ్వనుంది.

Whatsapp new features, వాట్సాప్​ కొత్త ఫీచర్లు
వాట్సాప్​ కొత్త ఫీచర్లు
author img

By

Published : Dec 22, 2021, 7:02 PM IST

Whatsapp new features: ఇన్​స్టంట్​ మెసెంజర్​ యాప్​ల నుంచి పోటీని దృష్టిలో పెట్టుకుని వినియోగదారుల కోసం మరిన్ని కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది వాట్సాప్​. త్వరలోనే వీటిని ఐఓఎస్​, ఆండ్రాయిస్​ యూజర్లకు అందుబాటులోకి తేనుంది. వీటిలో టాప్​ 5 కొత్త ఫీచర్ల వివరాలు ఆన్​లైన్​లో లీక్ అయ్యాయి. అవేంటంటే..

కొత్త కాలింగ్ ఇంటర్​ఫేస్​

వాట్సాప్​లో అత్యంత ఆదరణ పొందిన ఫీచర్​ వాయిస్​ కాల్​, వీడియో కాల్. మొబైల్​ డేటా లేదా వైఫై ద్వారా ఇతరులకు కాల్ చేసే సౌకర్యం ఈ ఫీచర్​ కల్పిస్తోంది. అయితే కొత్త ఫీచర్​లో ఈ కాలింగ్ ఇంటర్​ఫేస్​ను అధునాతనంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దనుంది వాట్సాప్​. ప్రత్యేకించి గ్రూప్​ కాల్స్​ సమయంలో ఇంటర్​ఫేస్​ ఇంకా బాగా కన్పించనుందని సమాచారం. బాటమ్​లో ఉండే బటన్లు మాత్రం అలాగే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ బీటా అప్డేట్​లో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.

whatspp encryption indicators

ఎన్​క్రిప్షన్ ఇండికేటర్స్​..

మరో ఫీచర్​లో వాట్సాప్​ చాట్​, కాలింగ్​ ఎండ్​-టు-ఎండ్​ ఎన్​క్రిప్టెడ్​ అని తెలిసేలా యూజర్లకు కొత్త ఇండికేటర్లు కన్పించనున్నాయి. మొదట ఈ ఫీచర్​ను ఆండ్రాయిడ్ ఐఓఎస్ బీటా యూజర్లకు, ఆ తర్వాత అందరికీ అందుబాటులోకి తేనున్నారు.

Whatsapp quick replies

క్విక్ రిప్లై

వాట్సాప్ బిజినెస్​ యాప్​లో క్విక్ రిప్లై షార్ట్​కట్​ను యాడ్​ చేయనుంది సంస్థ. దీంతో ఈ యాప్ వినియోగించే యూజర్లు తమ కస్టమర్లకు కొన్ని ప్రీసెట్ సందేశాలను వేగంగా పంపొచ్చు. వాట్సాప్ బిజినెస్ యూజర్లు '/' ను టైప్​ చేసి ప్రీసెట్ సందేశాలను ఎంపిక చేసుకోవచ్చు. ఈ ఫీచర్​ కుడా మొదట ఆండ్రాయిడ్, ఐఓఎస్​ బీటా యాజర్లకు, ఆ తర్వాత మిగతా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

whatsapp group admin powers

అడ్మిన్​ పవర్​ఫుల్​

త్వరలో గ్రూప్​ అడ్మిన్లకు మరిన్ని అధికారాలు ఇవ్వనుంది వాట్సాప్​. గ్రూప్​లోని ఇతర సభ్యులు పంపిన సందేశాలను డిలీట్​ చేసే వీలును కల్పించనుంది. సభ్యుల అనుచిత ప్రవర్తనను నియంత్రించేందుకు ఈ ఫీచర్​ను తీసుకొస్తోంది. అయితే అడ్మిన్ డిలీట్​ చేసిన మెసేజ్​ల నోటీసు కాస్త భిన్నంగా కన్పించనుంది.

కమ్యూనిటీస్​..

కొత్త కమ్యూనిటీ క్రియేట్​ చేసే సదుపాయాన్ని కూడా వాట్సాప్ కల్పించనుంది. అడ్మిన్​.. కమ్యూనిటీ ఇన్వైట్​ లింక్​ ద్వారా సభ్యులను ఆహ్వానించవచ్చు. ఆ తర్వాత ఇతర సభ్యులకు సందేశాలు పంపొచ్చు. ఈ కమ్యూనిటీల ద్వారా ఒక గ్రూప్​లో మరో గ్రూప్​ను కూడా క్రియేట్​ చేసే సదుపాయం అడ్మిన్​కు ఉంటుంది. సాధారణ గ్రూప్​లకు, కమ్యూనిటీలకు తేడా స్పష్టంగా తెలిసేలా ఈ ఫీచర్​ను డిజైన్​ చేసింది.

Whatsapp new update

వీటితో పాటు మరిన్ని ఫీచర్లను వాట్సాప్ త్వరలో యూజర్ల కోసం తీసుకురానుంది. ఇవన్నీ మొదట ఆండ్రాయిడ్, బీటా యూజర్లకు ఆ తర్వాత అందరికీ అందుబాటులోకి వస్తాయి.

ఇదీ చదవండి: టెస్లా నుంచి గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌- ధర ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.