Uber Whatsapp India: వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు ఉబర్- వాట్సాప్ జతకట్టాయి. ఇకపై భారత ప్రజలు వాట్సాప్ ద్వారా ఉబర్ రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు. ఉబర్ లాంటి సంస్థ.. వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్‌తో జతకట్టడం ప్రపంచంలో ఇదే తొలిసారి!
ఈ కలయికతో.. ఇక ప్రజలు ఉబర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేదు. రిజిస్ట్రేషన్ నుంచి, రైడ్ బుకింగ్, ట్రిప్ రిసీట్ వరకు అన్ని వాట్సాప్‌లోనే చూసుకోవచ్చు. దీంతో బుకింగ్ సదుపాయం మరింత సులభం కానుంది.
Whatsapp Uber Booking: తొలుత.. లఖ్‌నవూలోని ఈశాన్య ప్రాంతంలో దీనిని పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టనున్నారు. అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న నగరాలకు త్వరలోనే విస్తరించనున్నారు.
ఎలా బుక్ చేసుకోవాలి?
- ముందుగా వాట్సాప్ నుంచి ఉబర్ బిజినెస్ ఖాతా నెంబర్‌కు మెసేజ్ చేయాలి.
- ఆ తర్వాత క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. లేదా ఉబర్ వాట్సాప్ చాట్ కోసం ఏర్పాటు చేసిన లింక్‌ను క్లిక్ చేయాలి.
- పిక్అప్, డ్రాప్ లొకేషన్ వివరాలు టైప్ చేయాలి. ఆ తర్వాత డ్రైవర్ సమాచారం తదితర వివరాలు వాట్సాప్‌లో వస్తాయి.
రైడ్ మధ్యలో మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలంటే వాట్సాప్ లొకేషన్ చూస్తే సరిపోతుంది. భద్రతాపరమైన అంశాల కోసం 'ఎమర్జెన్సీ' ఆప్షన్‌ను కూడా ఏర్పాటు చేశారు. అది ప్రెస్ చేస్తే.. ఉబర్ కస్టమర్ సపోర్ట్ బృందం నుంచి వెంటనే ఫోన్ వస్తుంది.