యాపిల్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీల కోసం స్మార్ట్ఫోన్లు తయారు చేసే తైవాన్ సంస్థ (Apple iPhone producer) ఫాక్స్‌కాన్.. ఎలక్ట్రిక్ కార్ల రంగంలోకి అడుగుపెట్టింది. ఫోన్ల తరహాలోనే కాంట్రాక్టు కింద విద్యుత్ కార్లను తయారు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి సంస్థ తన ప్రణాళికలను వివరించింది. (Foxconn Apple)
![Smartphone producer Foxconn announces electric car venture](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13389767_vlcsnap-2021-10-18-18h45m37s164-2.jpg)
చైనా, ఉత్తర అమెరికా, ఐరోపా సహా ఇతర మార్కెట్ల కోసం కార్లు, బస్సులను ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ఉత్పత్తి (Foxconn Electric vehicle) చేయనుందని ఆ సంస్థ ఛైర్మన్ యంగ్ లియూ తెలిపారు. మార్కెట్లకు అనుగుణంగా తమ ఉత్పత్తుల ఫీచర్లను క్లైంట్లు(తయారీ కోసం ఆర్డర్ ఇచ్చే సంస్థలు) మార్చుకోవచ్చని వెల్లడించారు.
![Smartphone producer Foxconn announces electric car venture](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13389767_vlcsnap-2021-10-18-18h45m37s164-1.jpg)
తొలి విద్యుత్ కార్...
ఇటాలియన్ డిజైనింగ్ సంస్థ పినిన్‌ఫరినా, తైవాన్‌కు చెందిన యులాంగ్ గ్రూప్, అమెరికన్ ఆటోమేకర్ ఫిస్కర్ ఇంక్ సంస్థలు తమకు క్లైంట్లుగా ఉన్నాయని ఫాక్స్‌కాన్ (Foxconn Electric car) తెలిపింది. పినిన్‌ఫరినా అభివృద్ధి చేసిన 'మోడల్ ఈ'.. విద్యుత్ కారును 2023లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ మోడల్ కారులో ఐదు సీట్లు ఉంటాయని, ఒకసారి ఛార్జ్ చేస్తే 750 కి.మీ ప్రయాణం చేయొచ్చని తెలిపింది.
![Smartphone producer Foxconn announces electric car venture](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13389767_vlcsnap-2021-10-18-18h45m37s164-3.jpg)
![Smartphone producer Foxconn announces electric car venture](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13389767_vlcsnap-2021-10-18-18h45m37s164-4.jpg)
సంస్థలో తొలి ఎలక్ట్రిక్ బస్‌గా 'మోడల్ టీ'ని తయారు చేస్తున్నట్లు ఫాక్స్‌కాన్ తెలిపింది. పూర్తి ఛార్జింగ్‌తో ఈ బస్సులో 400 కిమీ వరకు ప్రయాణం చేయవచ్చని పేర్కొంది.
ఇదీ చదవండి: