ETV Bharat / business

'కంపెనీల దివాలా పరిమితి రూ.కోటికి పెంపు'

కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు సంస్థలకు ఊరట కలిపించింది కేంద్ర ప్రభుత్వం. నష్టాలను ఎదుర్కొంటున్న కారణంగా దివాలా పరిమితిని రూ.లక్ష నుంచి కోటికి పెంచింది. కరోనా సమయంలో అప్పులు కట్టలేకపోవడాన్ని ఎగవేత కింద పరిగణించమని స్పష్టం చేసింది.

defaulting on loans
కంపెనీల ఎగవేత పరిమితి పెంపు.. ఏకంగా లక్ష నుంచి కోటికే
author img

By

Published : May 17, 2020, 1:52 PM IST

కొవిడ్ -19తో ఎదురైన ఆర్థిక ఒత్తిడి కారణంగా రుణాలను ఎగవేసే ప్రయత్నాల్లో ఉన్న సంస్థలకు ఉపశమనం కలిగించే ప్రయత్నాలు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లపై దివాలా ప్రక్రియ అమలు చేసే అవకాశాలను తగ్గించేందుకు.. ఎగవేత పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.కోటికి పెంచింది. ఈ నిర్ణయంతో భారీ స్థాయిలో కంపెనీలు దివాలాలోకి జారకుండా జాగ్రత్త వహించవచ్చన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.

దివాలా నియమావళి కింద ఏడాది పాటు ఎలాంటి చర్యలు ఉండవన్నారు. కరోనా సంక్షోభంలో తీర్చలేని రుణాలను దివాలా కింద పరిగణించమని వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్సీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఐబీబీఐ) నిబంధనల్లో మార్పులు తెచ్చేందుకు ఆర్డినెన్స్​ తెస్తామని ప్రకటించారు.

కంపెనీల చట్టంలో మార్పులు..

  • కంపెనీల చట్టం ద్వారా డిఫాల్ట్‌లను ఎదుర్కొనే సంస్థలకు ఇకపై శిక్షలు ఉండవు. 5 ప్రత్యామ్నాయ విధానాల్లో వాటిని పరిష్కరిస్తారు.
  • సీఎస్​ఆర్​ రిపోర్టింగ్​, బోర్టు రిపోర్టు, ఢిపాల్ట్​ ఫైలింగ్​, ఏజీఎమ్​(వార్షిక సమావేశం) ఆలస్యం వల్ల కంపెనీ చట్టం నుంచి ఎదుర్కొనే చర్యలు ఇకపై ఉండవు.

రాజీ చేసుకోగలిగే నేరాలను అంతర్గత తీర్పు విధానం(ఐఏఎణ్​)కు మార్చనున్నట్లు తెలిపారు నిర్మలా. ఆర్డినెన్స్ ద్వారా సవరణలు తీసుకువచ్చి.. క్రిమినల్ కోర్టులు, జాతీయ​ కంపెనీ లా ట్రిబ్యునల్​(ఎన్​సీఎల్​టీ)లు చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటామన్నారు.

కార్పోరేట్​ సంస్థల్లో సులభతర వాణిజ్యం..

కార్పోరేట్​ సంస్థల్లో సులభతర వాణిజ్యాన్ని పెంచేందుకు కేంద్రం కొన్ని సడలింపులు చేసింది. భారతీయ ప్రభుత్వ సంస్థలు.. విదేశీ అధికార పరిధిలో సెక్యూరిటీలను నేరుగా లిస్టింగ్​ చేయడానికి అనుమతులిచ్చింది.

  • స్టాక్ ఎక్స్ఛేంజీలలో కన్వర్టిబుల్ కాని డిబెంచర్లను జాబితా చేసే ప్రైవేట్ కంపెనీలను.. లిస్టెడ్ కంపెనీలుగా పరిగణించరు.
  • నేషనల్​ కంపెనీ లా అప్పీలేట్​ ట్రిబ్యునల్​(ఎన్​సీఎల్​ఏటీ)కు ప్రత్యేకమైన బెంచ్​లు ఏర్పాటు చేసుకునే అధికారం ఇవ్వనున్నారు.
  • చిన్న సంస్థలు, ఒక్క వ్యక్తి అధ్యక్షతన నడిచే కంపెనీలు, స్టార్టప్​లు, ప్రోడ్యూసర్​ కంపెనీలు ఎదుర్కొనే అన్ని రకాల దివాలాలకు... ఇకపై తక్కువ జరిమానాలు మాత్రమే ఉండనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.