ETV Bharat / business

SBI news: ఎస్​బీఐకి ఆర్​బీఐ షాక్- రూ.కోటి జరిమానా​

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు(ఎస్‌బీఐ)(RBI penalty SBI) రూ.కోటి జరిమానా విధించింది రిజర్వు బ్యాంక్ ఆఫ్​ ఇండియా(ఆర్‌బీఐ). నియంత్రణపరమైన నిబంధనలు ఉల్లంఘించినందుకే ఈ జరిమానా విధించినట్టు ఆర్​బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

State Bank of India
ఎస్​బీఐ
author img

By

Published : Nov 27, 2021, 11:12 AM IST

భారతీయ స్టేట్​ బ్యాంకుకు రిజర్వు బ్యాంకు ఆఫ్​ ఇండియా(ఆర్​బీఐ) భారీ షాకిచ్చింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.కోటి జరిమానా(RBI impose fine on SBI) విధించింది. 2018 మార్చి 31, 2019 మార్చి 31న ఆర్థిక అంశాలకు సంబంధించి ఎస్‌బీఐ సూపర్‌వైజరీ ఎవాల్యుయేషన్‌ (ఐఎస్‌ఈ) చట్టబద్ధ తనిఖీలు చేపట్టిందని, నష్ట మదింపు నివేదికల్లో కొన్ని నిబంధనలు పాటించనందుకు ఎస్‌బీఐకి షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు ఆర్‌బీఐ తెలిపింది. బ్యాంక్‌ ఇచ్చిన సమాధానం, ఇతర వివరాలను పరిశీలనలోకి తీసుకుని జరిమానా(RBI impose penalty on SBI) విధించింది

ఆర్​బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా రుణగ్రహీత కంపెనీల్లో ఎస్​బీఐకి షేర్లున్నట్లు గుర్తించి.. ఈమేరకు జరిమానా విధించింది. బ్యాంకింగ్​ నియంత్రణ చట్టం కింద 1949లోని సెక్షన్‌ 19(2) ప్రకారం ఆర్​బీఐ ఈ చర్య తీసుకుంది.19(2) ప్రకారం.. ఏ బ్యాంకింగ్‌ సంస్థ అయినా ఏ కంపెనీలోనైనా వాటాలను, తనఖాగా లేదా సంపూర్ణ యజమానిగా చెల్లించిన షేర్​ క్యాపిటల్​లో 30 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని కలిగి ఉండకూడదు.

ఇదీ చూడండి: Tomato Price: 'టమాట ధర... మరో రెండు నెలల పాటు తగ్గేదేలే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.