ETV Bharat / business

సైన్యంలోకి ధనుష్!

వీలైనంత త్వరగా 114 ధనుష్ ఆర్టిలరీ గన్​లను తయారుచేసి సైన్యానికి అందించాలని ఆర్డినెన్స్ ప్యాక్టరీ బోర్డును రక్షణ శాఖ ఆదేశించింది.

ధనుష్ ఆర్టిలరీ గన్
author img

By

Published : Feb 20, 2019, 5:12 AM IST

Updated : Feb 20, 2019, 10:41 AM IST

దేశీయంగా రూపొందిన దీర్ఘశ్రేణి ఆర్టిలరీ గన్​లను పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేయాలంటూ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు(ఓఎఫ్​బీ)కు రక్షణ శాఖ ఆర్డరు జారీ చేసింది. 155 మిల్లీమీటర్ల 45 క్యాలిబర్ గల 114 ధనుష్ ఆర్టిలరీ గన్​లను సైన్యానికి త్వరితగతిన అందించాలనిఆదేశించింది.
మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఓఎఫ్​బీకి ఆర్డరు లభించింది.

ధనుష్ ప్రత్యేకతలు

అంతర్గత నావిగేషన్ సైటింగ్, లక్ష్యాలకు అనుగుణంగా దిశను మార్చుకునే వ్యవస్థ, బాలిస్టిక్ కంప్యుటేషన్ వ్యవస్థ, పగలుతో పాటు రాత్రి కూడా సమర్థంగా లక్ష్యాలను ఛేదించటం.

సుదూర లక్ష్య ఛేదన సామర్థ్యంగల ధనుష్ గన్​లను రక్షణ దళాల వినియోగానికి ఉత్పత్తి చేయటం ఇదే తొలిసారని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తెలిపింది.
దేశీయంగా రూపకల్పన చేసిన భారీ ఆర్టిలరీ గన్ ధనుష్ తయారీలో డీఆర్డీఓతో పాటు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, సెయిల్ సహకారం అందించాయని ఆర్డినెన్సు ఫ్యాక్టరీ బోర్డు స్పష్టం చేసింది.

This is test file from feedroom
Last Updated : Feb 20, 2019, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.