ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సేవలు సోమవారం చాలా సేపు నిలిచిపోవడం ఆ సంస్థకు భారీ నష్టాలను మిగిల్చింది. భారత కాలమానం ప్రకారం.. రాత్రి గంటలకు నిలిచిపోయిన ఈ ప్లాట్‌ఫామ్స్ సేవలు.. దాదాపు 7 గంటల తర్వాత తిరిగి అందుబాటులోకి వచ్చాయి. ఫేస్బుక్ చరిత్రలో ఇంత సేపు సేవలు నిలిచిపోవడం ఇదే తొలిసారి.
ఈ ప్రభావంతో అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీల్లో (నాస్డాక్లో) ఫేస్బుక్ షేర్లు 4.9 శాతం పడిపోయాయి. దీనితో ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సంపద 7 బిలియన్ డాలర్లకుపైగా (రూ.52 వేల కోట్లు) తగ్గింది. ఫలితంగా ఆయన మొత్తం సంపద 121.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఫలితంగా ప్రపంచ కుబేరుల్లో మార్క్ జుకర్‌బర్గ్ 5వ స్థానానికి పడిపోయారు.
ఫేస్‌బుక్‌పై ట్విట్టర్లో మీమ్స్..
చాలా సేపు సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో.. ప్రత్యర్థి సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్లో యూజర్లు.. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టాను ట్రోల్ చేశారు. ట్విట్టర్ కూడా దీనిపై తనదైన శైలిలో స్పందించింది.
-
Me enjoying all the memes on twitter after instagram, WhatsApp and Facebook is down#facebookdown pic.twitter.com/wFRdnLFWKy
— Shila Haque (@ummekulsumshila) October 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Me enjoying all the memes on twitter after instagram, WhatsApp and Facebook is down#facebookdown pic.twitter.com/wFRdnLFWKy
— Shila Haque (@ummekulsumshila) October 4, 2021Me enjoying all the memes on twitter after instagram, WhatsApp and Facebook is down#facebookdown pic.twitter.com/wFRdnLFWKy
— Shila Haque (@ummekulsumshila) October 4, 2021
అయితే వినియోగదారులకు ఏర్పడిన అసౌకర్యానికి ఫేస్బుక్ క్షమాపణలు చెప్పింది. సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కూడా యూజర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు.. సేవల పునరుద్ధరణ తర్వాత ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు.