రిలయన్స్ జియో (reliance jio) డేటా విప్లవానికి అయిదేళ్లు పూర్తయ్యాయి. 2016 సెప్టెంబరు 5న జియో కార్యకలాపాలు ఆరంభించినప్పటి నుంచి ఇప్పటికి దేశంలో ఒక్కో వినియోగదారు నెలవారీ డేటా సగటు వినియోగం ఏకంగా 1303 శాతం పెరిగింది. చౌకధరలకు, వేగవంతమైన డేటాను జియో అందుబాటులోకి తేవడంతో, టెక్ కంపెనీలకూ ఎంతో లాభం కలిగింది. జియో ప్రారంభం నుంచీ కాల్స్‌ను ఉచితంగా ఇవ్వడం మరో సంచలనమే అయ్యింది. వ్యాపారాల విస్తృతికి తోడు అంతర్జాతీయ పెట్టుబడులు సమకూరి, సంస్థ అధిపతి ముకేశ్ సంపద కూడా 92.6 బిలియన్ డాలర్లకు చేరింది.
డిజిటల్ ఆర్థికానికి..
డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకోడానికి కూడా జియో చౌకగా అందించిన డేటా దోహదపడింది. యూపీఐ చెల్లింపుల విలువ 2 లక్షల రెట్లు, లావాదేవీల సంఖ్య 4 లక్షల రెట్లు పెరిగింది. యాప్ డౌన్‌లోడ్లు 2016లో 650 కోట్లు కాగా, 2019 నాటికే ఇవి 1,900 కోట్లకు చేరాయి. స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు పెరిగేందుకు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అధికులకు చేరువయ్యేందుకు పరోక్షంగా జియో కారణమైంది. గూగుల్ ఇండియా, జొమాటో, నెట్‌ఫ్లిక్స్, పేటీఎం,హెచ్‌డీఎఫ్‌సీ, హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఫోన్‌పే, అపోలో హాస్పిటల్స్, వివో, ఓపో.. వంటి దిగ్గజ సంస్థలన్నీ జియోకు ట్విటర్ ద్వారా వార్షికోత్సవ అభినందనలు తెలిపాయి.
ఇదీ చూడండి: 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ముకేశ్ అంబానీ!