ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) అరుదైన రికార్డు నమోదు చేసింది. రూ.లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్(ఎం-క్యాప్)(IRCTCM-Cap) ఎలీట్ క్లబ్‌లో చేరిన తొమ్మిదో ప్రభుత్వ రంగ సంస్థగా(పీఎస్‌యూగా)(PSU stocks news) నిలిచింది. ఈ ఏడాది ఇప్పటివరకు షేర్ల విలువ 300 శాతానికిపైగా పెరగడం వల్ల ఇది సాధ్యమైంది.
దేశీయంగా సానుకూల పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం.. స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఫలితంగా ఐఆర్‌సీటీసీ షేర్లు(IRCTC stock price) మంగళవారం దూసుకుపోతున్నాయి. బీఎస్ఈలో సంస్థ షేర్లు 6 శాతానికిపైగా పుంజుకుని.. రూ.6,266.70 వద్ద కొనసాగుతోంది.
దీనితో సంస్థ మార్కెట్ క్యాపిటల్ (IRCTC M-cap) రూ.లక్ష కోట్ల మార్కును చేరుకుంది.
రెండేళ్లలో 18 రెట్లకుపైగా..
2019 అక్టోబరు 14న బీఎస్ఈలో ఐఆర్‌సీటీసీ(IRCTC news) లిస్ట్ అయింది. అప్పటి నుంచి 18 రెట్లు లేదా 1,737 శాతానికిపైగా పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 308.1శాతం లాభపడగా.. అక్టోబరులో ఇప్పటివరకు 58శాతం వృద్ధి చెందింది.
కేటరింగ్, రైల్‌నీర్ సానుకూలతతో..
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, భారీగా టీకాల పంపిణీతో దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం వంటి సానుకూల పరిణామాలతో ఐఆర్‌సీటీసీ(IRCTC news) పుంజుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. పండుగ సీజన్‌తో సంస్థ రాబడి పెరగడం సహా నాలుగో త్రైమాసికంలో కేటరింగ్, రైల్ నీర్, ఆన్లైన్ టికెటింగ్ విభాగం వృద్ధి చెందింది. ఇన్ని సానుకూల అంశాల మధ్య ఐఆర్‌సీటీసీ కీలక మైలురాయిని చేరుకుంది.
అంతకుముందు..
గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోల్ ఇండియా, ఎన్ఎండీసీ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఎస్బీఐ కార్డులు వంటి పీఎస్‌యూ స్టాక్స్(PSU stocks news) ఈ మైలురాయిని సాధించాయి.
ఇదీ చూడండి: ఐఫోన్ తయారీ సంస్థ నుంచి ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు