ETV Bharat / business

భారత్​లో చైనా వస్తువులను నిషేధిస్తే నష్టమెవరికి?

భారత సైనికుల మృతికి కారణమైన చైనాపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. చైనా వస్తువులను నిషేధించాలని, వారి సంస్థలను దేశం నుంచి బహిష్కరించాలని చర్చ నడుస్తోంది. సీఏఐటీ 'భారతీయ సామాన్​-హమారా అభిమాన్' నినాదంతో కొత్త ఉద్యమానికి తెరలేపింది.​ చైనా వస్తువులపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంటూ... 450 నిత్యావసర వస్తువులు, 3వేల చైనీయుల ఉత్పత్తుల జాబితాను విడుదల చేసింది. ఈ ప్రకటనలకు పలువురు కేంద్ర మంత్రులూ మద్దతిచ్చారు. అయితే చైనా వస్తువులను బ్యాన్​ చేస్తే ఎదురయ్యే సమస్యలేంటి? ఎవరికి ఎక్కువ నష్టం?

author img

By

Published : Jun 19, 2020, 7:26 PM IST

china goods telugu news
భారత్​లో చైనా వస్తువులను నిషేధిస్తే నష్టమెవరికి?

చైనా వస్తువులను నిషేధిస్తే మొట్టమొదట దెబ్బ టెలికాం రంగంపైనే పడనుంది. ఇప్పటికే ఈ రంగంలో 20 ఏళ్ల కాలానికిగానూ దాదాపు 2 బిలియన్​ డాలర్లు వెచ్చించింది చైనాకు చెందిన హువావే సంస్థ. 6వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఇప్పుడు చైనా ఉత్పత్తులపై నిషేధం అంటే కచ్చితంగా ఈ సంస్థ ఉనికి ప్రమాదంలో పడనుంది. ఉద్యోగాల కోత నుంచి టెలికాం రంగంలో సేవల వరకు అన్నింటిలోనూ అనూహ్య మార్పులు రావచ్చు.

చైనా సంస్థలు తయారు చేసిన ముడిసరుకు, పరికరాలను ప్రభుత్వరంగ సంస్థలైన బీఎస్​ఎన్​ఎల్​, ఎమ్​టీఎన్​ఎల్​లో వినియోగించకూడదని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.​ అయితే భారత్​లో నడుస్తోన్న కొన్ని ప్రవేటు టెల్కోలు, హువావే వంటి సంస్థలు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ప్రాంతీయ రాజకీయాల కారణంగా వ్యాపారాలను దెబ్బతీయొద్దని కోరాయి. తాజా నిర్ణయం వల్ల దేశంలోని టెలికాం ఆపరేటర్లు, చైనా టెలికాం పరికరాల తయారీదారుల మధ్య సత్సంబంధాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నాయి.

ఖర్చు తడిసి మోపెడు...

తక్కువ ధరలకు సేవలందించే చైనా సంస్థలపై ప్రభుత్వం నిషేధం విధిస్తే.. ప్రైవేటు రంగంలోని టెలికాం నెట్​వర్క్​లు ఇబ్బందులు పడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న వొడాఫోన్​, భారతీ ఎయిర్​టెల్​ వంటి సంస్థలు 20-30 శాతం అధిక భారం మోయాల్సి వస్తుంది.

హువావే, జేటీఈ సంస్థలు టెలికాం రంగంలోనూ పోటీపడుతూ.. మార్కెట్​లో నాలుగో స్థానంలో ఉన్నాయి. సంస్థల మధ్య పోటీ వల్లే ప్రస్తుతం తక్కువ రేటుకు టెలికాం సేవలు అందుబాటులో ఉన్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. చైనా సంస్థలపై నిషేధంతో సేవల ధరలు పెరిగితే చివరకు అదంతా వినియోగదారులే భరించాలి.

చైనా సంస్థల 'స్వదేశీ' మంత్రం

భారత్​లో అమ్ముడవుతున్న మొత్తం మొబైళ్లలో దాదాపు 70 శాతం వాటా​ చైనా సంస్థలదే. అయితే అవన్నీ 'మేడ్​ ఇన్​ ఇండియా' పేరుతో భారతీయ బ్రాండ్​లుగా ఇక్కడ స్థిరపడిపోయాయి.

చైనా ఉత్పత్తులను కాదనుకుంటే కొరియా సంస్థ శాంసంగ్ ప్రత్యామ్నాయం కానుంది. ప్రస్తుతం మార్కెట్​లో రియల్​మీ, షియోమీ, టెక్నో, ట్రాన్సిషన్​, ఒప్పో, వివో, వన్​ప్లస్​ వంటి సంస్థలు గట్టిపోటీనిస్తున్నాయి. మేమూ దేశీయమే అని చెప్పుకుంటున్నాయి.

షిమోమీ సంస్థ దేశవ్యాప్తంగా 50వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. అంతేకాకుండా 10కిపైగా స్వదేశీ స్టార్టప్​లలో పెట్టుబడులు పెట్టి వాటికి ఆర్థికంగా ఊతమిస్తోంది. చైనా ఉత్పత్తులు, సంస్థలపై వేటు వేస్తే.. వారంతా ఇబ్బందులు పడతారు.

కరోనా లాక్​డౌన్​ కారణంగా ఎక్కువ మంది వర్క్​ ఫ్రమ్​ హోం చేస్తుండగా.. ఎలక్ట్రానిక్​ వస్తువుల వినియోగం బాగా పెరిగింది. అయితే డిమాండ్​కు తగ్గ సరఫరా​ చేసేందుకు ప్రస్తుతం సంస్థలకు నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో చైనా వస్తువులపై నిషేధం​ వంటిది సరికాదని.. ఇది వినియోగదారుల సేవలపై మరింత ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులపై చైనా సంస్థలేవి నోరు మెదపకపోయినా...ఈ ఏడాది సేల్స్​లో కాస్త లోటు ఎదుర్కొంటాయని అంచనా వేస్తున్నారు.

ఇవీ చూడండి:

  1. భారత్- చైనా బలాబలాల్లో ఎవరిది పైచేయి?
  2. భారత్​-చైనా వివాదం: ఈటీవీ భారత్​ ముఖ్య కథనాలు
  3. 'చైనాతో తెగతెంపులు కూడా ఓ ప్రత్యామ్నాయమే!'
  4. గల్వాన్‌ ఘటనలో 76 మంది సైనికులకు గాయాలు?
  5. భారత్​ దెబ్బకు అప్పట్లోనే గడగడలాడిన చైనా
  6. సరిహద్దు ఘర్షణ చైనా వ్యూహంలో భాగమే!
  7. 'భారతదేశ సౌర్వభౌమత్వాన్ని చైనా గౌరవించాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.