దేశీయ మార్కెట్లో బంగారం ధర మంగళవారం స్వల్పంగా తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.137 దిగొచ్చి.. రూ.51,245 కు చేరింది.
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో నెలకొన్న ఒత్తిడి కారణంగా పసిడి ధరలు తగ్గుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
వెండి ధర కిలోకు రూ.475 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.62,648 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,903.6 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 24.48 డాలర్ల వద్ద స్థిరపడింది
అమెరికా డాలర్‌తో పోల్చితే.. రూపాయి విలువ 13 పైసలు బలపడి రూ.73.71 వద్ద నిలిచింది.