స్వల్ప లక్షణాలతో బాధపడే కరోనా రోగులకిచ్చే ఫాబిప్లూ ఔషధ ధరలను తగ్గిస్తున్నట్లు గ్లెన్‌మార్క్ ఫార్మా సంస్థ తెలిపింది. ఒక్కో ట్యాబ్లెట్‌పై 27 శాతం మేర ధర తగ్గిస్తూ.. 75 రూపాయలకే అందించనున్నట్లు పేర్కొంది.
తొలి దశలోని కరోనాకు విరుగుడుగా ఫావిపిరావీర్ టాబ్లెట్‌ను(ఫాబిప్లూ ఔషధం) జూన్ 20న అందుబాటులోకి తెచ్చింది గ్లెన్‌మార్క్. అప్పుడు ఒక్కో ట్యాబ్లెట్ ధర 103 రూపాయలు.
అధిక ఉత్పత్తితోనే ధర తగ్గింపు సాధ్యమైందని తెలిపింది గ్లెన్‌మార్క్. ఈ నిర్ణయంతో దేశంలోని ఎక్కవ మంది కరోనా రోగులకు తమ ఔషధం అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేసింది.
ఇదీ చదివేయండి: కరోనాకు డ్రగ్ రిలీజ్- ఒక్కో టాబ్లెట్ రూ.103