రాష్ట్రాల మధ్య వ్యక్తిగత వాహనాల బదిలీని సులభతరం చేసేందుకు కేంద్రం ఇటీవల కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియను (New vehicle registration regime) తీసుకొచ్చింది. కొత్త వాహనాలకు భారత్ సిరీస్ (BH-series) మార్క్‌తో రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు తెలిపింది. కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆగస్టులోనే నోటిఫై చేసింది. మరి బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది? అనేది ఇప్పుడు చూద్దాం.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా (BH-series registration)..
1. ఫారం 20..
కొత్త వాహనం కొనే సమయంలో.. వినియోగదారు తరఫున డీలర్ ఫారం-20ని నింపాల్సి ఉంటుంది. ఆన్లైన్లో వాహన్ పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి.
2. సిరీస్ టైప్ ఎంపిక
ఇందులో డీలర్ భారత్ సిరీస్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. (ప్రస్తుతం రాష్ట్రాల వారీగా సరీస్‌లు ఉన్నాయి.)
3. అప్లికేషన్ అప్రూవల్
డీలర్ నింపిన అప్లికేషన్‌ను స్థానిక రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ (ఆర్టీఓ) ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
5.ట్యాక్స్
వాహనం రకాన్ని బట్టి రిజిస్ట్రేషన్ ఫీజు/ మోటార్ వెహికిల్ ట్యాక్స్ (సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఓసారి) చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ప్రక్రియ పూర్తయి.. అన్ని అనుమతులు లభించిన తర్వాత వాహన్ 4.. బీఎస్ సిరీస్ నంబర్‌ను జరరేట్ చేస్తుంది. ఈ సంఖ్యనే నంబర్ ప్లేట్‌పై ఉంటుంది.
బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ ఇలా ఉంటుంది
- బీహెచ్ నంబర్ ప్లేట్ 'YY BH #### XX ' ఫార్మాట్లో ఉంటుంది.
- YY- రిజిస్టర్ అయిన సంవత్సరం
- BH- భారత్ సిరీస్ కోడ్ (అన్ని వాహనాలకు ఓకే విధంగా ఉంటుంది)
- ####- నాలుగు అంకెల గుర్తింపు
- XX- ఇంగ్లిష్ అక్షరాలు A- Z వరకు ఏవైనా ఉండొచ్చు.
ఇదీ చదవండి: వాహనదారులకు షాక్- మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు