దేశీయ మార్కెట్లో ఒకప్పుడు మొబైల్ ఫోన్లకే పరిమితమైన పోటీ ఇప్పుడు ల్యాప్‌టాప్‌ల విషయంలోనూ మొదలైంది. పర్సనల్, గేమింగ్ ల్యాప్‌టాప్‌లకు డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే అదనుగా కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తూ.. ప్రత్యర్థి సంస్థలకు పోటీ ఇస్తున్నాయి ల్యాప్‌టాప్ తయారీ కంపెనీలు. అలా ఇటీవల విడుదలైైన ప్రముఖ కంపెనీల ల్యాప్‌టాప్‌ల వివరాలు ఇప్పుడు చూద్దాం.
హెచ్‌పీ...
ఇటీవల హెచ్‌పీ బడ్జెట్ సెగ్మెంట్లో 14ఎస్, పెవీలియన్ ఎక్స్ 360, 14ఎస్ పేరుతో రెండు మోడళ్లను విడుదల చేసింది.
ఈ రెండు మోడళ్ల ఫీచర్లు..
- 14 అంగుళాల డిస్ప్లే
- 4జీ సిమ్ వేసుకునే వెసులుబాటు
- ఐ3, 10వ జనరేషన్+ 4 జీబీ ర్యామ్, ఐ5, 10వ జనరేషన్+ 8 జీమ్ ర్యామ్ వేరియంట్లలో లభ్యం
- 14ఎస్ ధర రూ.44,999
- పెవీలియన్ ఎక్స్ 360 ధర రూ.64,999
- పెవీలియన్ ఎక్స్ 360, 14ఎస్.. ఐ5, 10వ జనరేషన్ ప్రాసెసర్, ఇంటెల్ ఐరిస్ ప్లస్ గ్రాఫిక్స్
- 11 గంటల బ్యాటరీ బ్యాకప్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.
లెనోవో..
లెనోవో ఏకంగా నాలుగు ల్యాప్‌టాప్‌లను ఇటీవల విడుదల చేసింది.
- ఐడియాపాడ్ స్లిమ్ 3, ఐడియాపాడ్ స్లిమ్ 5, ఐడియాపాడ్ గేమింగ్ 3, యోగా స్లిమ్ 7ఐ పేరుతో వీటిని తీసుకొచ్చింది.
- ఈ మోడళ్లన్నీ ఇంటెల్, ఏఎండీ రైజెన్ ప్రాసెసర్లతో పని చేస్తాయి.
- స్లిమ్ 3.. 14 అంగుళాలు, 15 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో అందుబాటులో ఉంది.
- ఎస్‌ఎస్, హెచ్‌డీడీలతో కూడిన హైబ్రిడ్ స్టోరేజ్ సదుపాయం స్లిమ్ 3లో ఉంది.
- స్లిమ్ 5 లో 10వ జనరేషన్ ఐ7, ఏఎండీ రైజెన్ ప్రాసెసర్లు ఉన్నాయి
- ఎన్‌విడియా జీఫోర్స్ ఎంఎక్స్ 330 గ్రాఫిక్స్ కార్డ్ ఉంది.
- గేమింగ్ 3.. 15.6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో అందుబాటులో ఉంది.
- ఇందులో ఎన్‌విడియ జీటీఎక్స్ 1660 టీఐ గ్రాఫిక్స్ కార్డ్ ఉంది.
- యోగా స్లిమ్ 7ఐ 14 అంగుళాల డిస్ప్లేతో అందుబాటులో ఉంది.
- 4కే, డాల్బీ విజన్ సపోర్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి ఉన్నాయి.
- ఈ ల్యాప్‌టాప్‌ల ధరలు రూ. 26,990 నుంచి రూ.40,990 వరకు నిర్ణయించింది.
షియోమీ..
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అగ్రస్థానాన్ని ఆక్రమించిన చైనా సంస్థ షియోమీ.. ఇటీవలే ల్యాప్‌టాప్‌ల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. మార్కెట్లోకి ప్రవేశిస్తూనే.. ఎంఐ నోట్ బుక్ 14, నోట్ బుక్ 14 హారిజన్ పేరిట రెండు మోడళ్లు విడుదల చేసింది.
రెండు మోడళ్ల ఫీచర్లు..
- 14 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే
- 8 జీబీ ర్యామ్
- నోట్ బుక్ 14 ఐ5 10 జనరేషన్‌తో లభిస్తుంది.
- 256 జీబీ ఎస్ఎస్‌డీ, 512 జీబీ ఎస్ఎస్‌డీ వేరియంట్లు ఉన్నాయి.
- వీటి ధరలు రూ.41,999, రూ. 44,999గా నిర్ణయించింది షియోమీ.
- 512 జీబీ వేరియంట్లో ఎన్విడియా జీఫోర్స్ ఎంఎక్స్ 250 జీపీయూ అప్షన్ కూడా ఉంది. దీని ధర రూ. 47,999.
- హారిజన్ నోట్ బుక్ 512జీబీ హైస్పీడ్ ఎస్ఎస్‌డీ పొందుపరిచింది.
- ఐ5 10 జనరేషన్, ఐ7 10 జనరేషన్ ప్రాసెసర్ వేరియంట్లు ఉన్నాయి. హారిజన్ నోట్‌బుక్ ప్రారంభ ధర రూ. 54,999.
డెల్..
- డెల్ లాటిట్యూడ్ 9510 పేరిట వ్యాపారుల కోసం ల్యాప్‌టాప్ ను విడుదల చేసింది.
- 15.6 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్
- 34 గంటల బ్యాటరీ సామర్థ్యం
- ఇది టూ ఇన్ వన్ కన్వర్టబుల్ సదుపాయం.
- ఇంటెల్ 10 జనరేషన్ జెన్ వీప్రో సీపీయూ
- ప్రారంభ ధర రూ.1,49,000.
- 5జీ మోడల్‌ను ఆప్షనల్‌గా తీసుకోవచ్చు
- 16 జీబీ ర్యామ్ , 1టీబీ ఎస్ఎస్‌డీ
ఆసుస్...
- అసస్ టీయూఎఫ్ ఏ15, ఏ17 పేరిట గేమింగ్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసింది.
- ఏ15.. 15.6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే
- ఏ 17.. 17.3 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే.
- 4 జనరేషన్ ఏఎండీ రైజన్ 4000 మొబైల్ ప్రాసెసర్
- ఏఎండీ రైజిన్ 9 4900హెచ్ ప్రాసెసర్
- ఎన్‌విడియా జీపోర్స్ జీటీఎక్స్ 1650, జీటీఎక్స్ 1650టీఐ, జీటీఎక్స్ 1660టీఐ వేరియంట్‌ను ఎంచుకునే సదుపాయం.
- జీటీఎక్స్ 2060 లిమిటెడ్ వేరియంట్ ఏ15 మోడల్లో ఉంది
- ఏ15 ప్రారంభ ధర రూ.60,990
- ఏ17 ప్రారంభ ధర రూ.60,990
త్వరలోనే మరో రెండు ల్యాప్‌టాప్‌లు (ఆర్‌ఓజీ జీఏ15, జీఏ35) విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఏసర్..
ఏసర్ నైట్రో 5 పేరిట గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది.
ఫీచర్లు..
- 15 అంగుళాలు, 17 అంగుళాల వేరియంట్లలో అందుబాటులోకి
- 10 జనరేషన్ ఇంటెల్ హెచ్ సిరీస్ ప్రాసెసర్
- ఎన్ విడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 2060 జీపీయూ వరకు ఎంచుకోవచ్చు
- 32జీబీ వరకు ర్యామ్ పెంచుకునే సదుపాయం
- ప్రారంభ ధర రూ. 72,990
ఇదీ చూడండి:వాట్సాప్ నుంచి త్వరలో అద్భుతమైన ఫీచర్!